Sidhu vs Channi: సిద్ధూతో వాగ్యుద్ధం.. రాజీనామాకు సిద్ధపడిన పంజాబ్ సీఎం చన్నీ..?
పంజాబ్ కాంగ్రెస్‌లో ఇంటి గొడవలు మరోసారి రచ్చకెక్కాయి. పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ, ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ సిద్ధూ మధ్య పొసగడం లేదని తెలుస్తోంది.

Punjab Politics: పంజాబ్ కాంగ్రెస్‌లో ఇంటి గొడవలు మరోసారి రచ్చకెక్కాయి. పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ, ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ సిద్ధూ మధ్య పొసగడం లేదని తెలుస్తోంది. సిద్ధూతో విభేదాల కారణంగానే కెప్టెన్ అమరీందర్ సింగ్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా రాజీనామా చేయని కెప్టెన్ అమరీందర్ సింగ్.. త్వరలోనే కొత్త పార్టీ పెట్టుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పార్టీ.. బీజేపీతో పొత్తు పెట్టుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సిద్ధూ, చన్నీ మధ్య కూడా పొగడం లేదన్న వార్తలు పంజాబ్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఆదివారం జరిగిన పార్టీ సీనియర్ నేతల కీలక సమావేశంలో ప్రభుత్వ కార్యక్రమాలపై సిద్ధూ అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. దీంతో అసహనానికి గురైన చన్నీ.. మీరు సీఎం పదవిని తీసుకుని, రెండు మాసాల్లో ఏం చేస్తారో చేసి చూపించాలని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య వాగ్యుద్ధం కాస్త తీవ్రంగానే సాగినట్లు సమాచారం. సిద్ధూ వ్యాఖ్యల పట్ల అసంతృప్తి వ్యక్తంచేస్తూ సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని చన్నీ స్పష్టంచేసినట్లు సమాచారం. పార్టీ పరిశీలకుడు హరీశ్ చౌదరీ, రాహుల్ గాంధీకి సన్నిహితుడైన కృష్ణ అల్లవరు, పంజాబ్ కేబినెట్ మంత్రి ప్రగత్ సింగ్ సమక్షంలోనే అంతా జరిగినట్లు తెలుస్తోంది.
చన్నీనుద్దేశించి సిద్ధూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వీడియో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 2022 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చన్నీ ముంచుతాడని ఆయన పేర్కొన్నట్లు ఆ వీడియోలో రికార్డయ్యింది.
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయాల్సిన వేళ.. సీఎం చన్నీ, సిద్ధూ మధ్య సమన్వయం లేకపోవడం పట్ల కాంగ్రెస్ అధిష్టానం తలలు పట్టుకుంటున్నట్లు జాతీయ మీడియా వర్గాల్లో కథనాలు వెలువడ్డాయి.
Also Read..
Rohit Sharma: టీ20ల్లో కొత్త కెప్టెన్‌గా రోహిత్ శర్మ.? వరల్డ్‌కప్ తర్వాత అఫీషియల్ ప్రకటన.!
కర్ణాటక చుట్టుప్రక్కల అద్భుతమైన ప్రాంతాలు ఇవే.. తక్కువ బడ్జెట్‌తోనే..