AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేతన్ కేస్ లో ప్రజాగ్రహం.. అమ్మాయి, ఆమె ప్రియుడిని శిక్షించాలంటూ భారీ క్యాండిల్ ర్యాలీ!

పుణెలో సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ మరణంపై న్యాయం చేయాలంటూ ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. నిందితులైన సదరు అమ్మాయిని, ఆమె ప్రియుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పింప్రి-చించ్వాడ్ ప్రాంతంలో బాధితుడి కుటుంబ సభ్యులు, స్థానికులు పెద్ద ఎత్తున క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. జస్టిస్ ఫర్ కేతన్ ప్లకార్డులతో శాంతియుతంగా నిరసన తెలుపుతూ, కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను కోరారు. ఇటు సోషల్ మీడియాలోనూ #JusticeForKetan హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది.

కేతన్ కేస్ లో ప్రజాగ్రహం.. అమ్మాయి, ఆమె ప్రియుడిని శిక్షించాలంటూ భారీ క్యాండిల్ ర్యాలీ!
Pune's Ketan Agarwal Case
Vijay Saatha
| Edited By: |

Updated on: Jun 28, 2026 | 8:03 AM

Share

పుణెలో సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ మరణ ఘటనపై న్యాయం చేయాలంటూ ప్రజల స్వరం మరింత బలపడుతోంది. కేతన్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. పింప్రి-చించ్వాడ్ ప్రాంతంలో జరిగిన ఈ శాంతియుత ర్యాలీలో పాల్గొన్న వారు చేతుల్లో కొవ్వొత్తులు, జస్టిస్ ఫర్ కేతన్ అని రాసిన ప్లకార్డులు పట్టుకుని అధికారులను వేగంగా దర్యాప్తు పూర్తి చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేతన్ నివసించిన ప్రాంత ప్రజలు, సమీప కాలనీలకు చెందిన పలువురు ఈ క్యాండిల్ మార్చ్‌లో పాల్గొని కుటుంబానికి అండగా నిలిచారు. కేతన్‌కు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని, ఈ ఘటనను మరచిపోకుండా సమాజం ముందుకు తీసుకెళ్లడమే ఈ ర్యాలీ ఉద్దేశమని కుటుంబ సభ్యులు తెలిపారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయడంలో ఎలాంటి జాప్యం ఉండకూడదని వారు స్పష్టం చేశారు.

సోషల్ మీడియాలో మార్మోగుతున్న #JusticeForKetan:

ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో కూడా #JusticeForKetan హ్యాష్‌ట్యాగ్ వేగంగా ట్రెండ్ అవుతోంది. దేశవ్యాప్తంగా నెటిజన్లు ఈ కేసులో పారదర్శక దర్యాప్తు జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కేతన్ మరణానికి సంబంధించిన పూర్తి నిజాలు వెలుగులోకి తీసుకురావాలని, బాధిత కుటుంబానికి త్వరితగతిన న్యాయం అందించాలని ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. కేతన్ అగర్వాల్ మరణ ఘటనపై దర్యాప్తు వేగవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు. కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న ఆవేదనను దృష్టిలో ఉంచుకుని కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని, వాస్తవాలను త్వరగా వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని ర్యాలీలో పాల్గొన్న వారు స్పష్టం చేశారు. ప్రజల ఆందోళనల నేపథ్యంలో ఈ కేసు మహారాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు:

మరోవైపు, ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెబుతున్నారు.. కేసుకు సంబంధించిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ, సాక్ష్యాధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో కేతన్‌కు త్వరితగతిన న్యాయం చేయాలంటూ ప్రజలు, సామాజిక సంస్థలు, నెటిజన్లు ఒకే స్వరంతో డిమాండ్ చేస్తుండటంతో ఈ కేసు పరిణామాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us