IPL Fever: ఐపీఎల్ చూడాల్సిందే..అప్పటిదాకా ముద్దకూడా ముట్టం..జైలులో ఖైదీల నిరసన..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ప్రపంచ క్రికెట్ ప్రేమికులకు అత్యంత ఇష్టమైన లీగ్.  దీనికి కరోనా కూడా అడ్డుకాలేకపోయింది. మ్యాచ్ లు స్టేడియంలోని చూడక్కర్లేదు.. ఇంట్లో కూచుని చూడొచ్చు

IPL Fever: ఐపీఎల్ చూడాల్సిందే..అప్పటిదాకా ముద్దకూడా ముట్టం..జైలులో ఖైదీల నిరసన..!
Ipl Fever
Follow us
KVD Varma

|

Updated on: Apr 14, 2021 | 12:51 PM

IPL Fever: ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ప్రపంచ క్రికెట్ ప్రేమికులకు అత్యంత ఇష్టమైన లీగ్.  దీనికి కరోనా కూడా అడ్డుకాలేకపోయింది. మ్యాచ్ లు స్టేడియంలోని చూడక్కర్లేదు.. ఇంట్లో కూచుని చూడొచ్చు అనే పాయింట్ మీద ప్రత్యక్ష ప్రేక్షకులు లేకుండా..ప్రత్యక్ష ప్రసారంతో ఐపీఎల్ అదరగొట్టేస్తోంది. ఐపీఎల్ టీవీలో వస్తుందంటే ఆ సమయానికి ఎన్నిపనులున్నా వాయిదా వేసుకుని మరీ టీవీల ముందు అతుక్కుపోయేవారు ఎందరో ఉన్నారు. ఐపీఎల్ మ్యాచ్ సమయాల్లో వినోద కార్యక్రమాలను కూడా పక్కన పెట్టేస్తారు.. అభిమానులు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. ఐపీఎల్ ఫీవర్ ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్ని పట్టి కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో ఒక జైలులోని ఖైదీలు ఐపీఎల్ మ్యాచ్ లు చూడకపోతే ముద్దకూడా ముట్టం అని భీష్మించారు.

ఉత్తరప్రదేశ్ లోని ఫరూఖాబాద్ లో ఓ జైలులో ఈ సంఘటన చోటు చేసుకుంది. తమకు ఐపీఎల్ మ్యాచ్ లు చూసేలా అవకాశం ఇవ్వాలని కోరుతూ ఫతేగడ్ కేంద్ర కారాగారంలో ఖైదీలు నిరాహార దీక్షకు దిగారు. ఈ ఉదయం టిఫిన్ చేయకుండా బైఠాయించారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ జైలు సూపరింటెండెంట్  ప్రహ్లాద్ఆ శుక్లా ఆ  సమయంలో  లక్నోలో అధికారులతో సమావేశంలో ఉన్నారు. విషయం తెలుసుకున్న ఆయన పరుగున జైలు వద్దకు చేరుకున్నారు. ఖైదీలతో చర్చలు జరిపారు. మొత్తమ్మీద వారితో జరిగిన చర్చల్లో ఒక పరిష్కారం దొరికింది. ఖైదీల డిమాండ్లకు జైలు అధికారులు అంగీకరించారు. దీంతో ఖైదీలు తమ దీక్షను విరమించారు.

ఖైదీలు మనుషులే. వారికీ కోరికలు ఉంటాయి. వారి డిమాండ్ లు కూడా పరిష్కరించాల్సిందే. ఒక్క జైలు నిబంధనలు అతిక్రమించనంత వరకూ.. వారి ప్రవర్తనలో ఇబ్బందికర అంశాలు లేనంత వరకూ వారి హక్కులకు ఏమాత్రం భంగం కలగకుండా చూసుకోవలసిన బాధ్యత జైలు అధికారులదే. ఒక్కోసారి ఖైదీల కోర్కెలు కూడా విచిత్రంగా ఉంటాయి. ఆ డిమాండ్ తీరకపోతే వారు ప్రవర్తించే విధానమూ డిఫరెంట్ గానే ఉంటుంది. జైలు లో ఉన్నవారంతా నేరస్తులూ కానక్కరలేదు.. వారిలో ఏళ్ల తరబడి విచారణలో మగ్గిపోతున్న నిందితులూ ఉంటారు. అందుకే, జైలు అధికారులు వారి న్యాయమైన డిమాండ్లను నిబంధనల మేరకు అంగీకరిస్తూ ఉంటారు.

Also Read: Rohit Sharma: స్పిన్‌‌కు అనుకూలంగా పిచ్‌లు.. బ్యాటింగ్ పక్కన పెట్టి..బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న హిట్‌మ్యాన్

KKR vs MI Score Highlights IPL 2021: కోల్‌కతాతో జరిగిన రెండో టీ20లో ముంబై ఇండియన్స్‌ విజయం