PM Modi: షార్ట్‌కట్ రాజకీయాలతో షార్ట్ సర్క్యూట్ తప్పదు.. రాజకీయ పార్టీలకు మోదీ హెచ్చరిక
షార్ట్‌కట్ రాజకీయాలు చేస్తే షార్ట్ సర్క్యూట్ తప్పదని హెచ్చరించారు ప్రధాని మోదీ. జార్ఖండ్‌లో సుడిగాలి పర్యటన చేశారు మోదీ. దేవ్‌ఘర్ ఎయిర్‌పోర్ట్‌తో పాటు ఎయిమ్స్‌ను ప్రారంభించారు.
చాలా రోజుల తరువాత జార్ఖండ్‌లో ప్రధాని మోదీ(PM MODI) పర్యటించారు. అనేక అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు ప్రధాని. దేవ్‌ఘర్ ఎయిర్‌పోర్ట్‌ను జాతికి అంకితం చేశారు. 2018లో ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేశామని , డైడ్‌లైన్ ప్రకారమే నిర్మాణం పూర్తయ్యిందన్నారు మోదీ ఎయిమ్స్‌ను కూడా ప్రారంభించారు మోదీ. ఈ కార్యక్రమానికి జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ హాజరయ్యారు. దేవ్‌ఘర్‌లో వైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని సందర్శించారు మోదీ. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వైద్యనాథ్ ఆలయాన్ని సందర్శించిన తొలి ప్రధానిగా మోదీ రికార్డును సొంతం చేసుకున్నారు. సోమనాథ్ లాగే వైద్యనాథ్ ఆలయాన్ని అభివృద్ది చేస్తామన్నారు మోదీ.
దేవ్‌ఘర్‌లో జరిగిన సభలో కీలక వ్యాఖ్యలు చేశారు మోదీ. షార్ట్‌కట్ రాజకీయ విధానాలతో దేశానికి పెను ప్రమాదం పొంచి ఉందన్నారు ప్రధాని మోదీ. షార్ట్ రాజకీయాలు చేస్తే తప్పకుండా షార్ట్ సర్క్యూట్ అవుతుందని హెచ్చరించారు. అధికారం కోసం అక్రమ మార్గాల్లో వెళ్లకూడదన్నారు మోదీ.
దేవ్‌ఘర్‌లో రోడ్‌షో నిర్వహించారు మోదీ. మోదీ రోడ్‌షోకు జనం నుంచి మంచి స్పందన లభించింది. భారీ ఎత్తున ఆదివాసీ మహిళలు ప్రధానికి రోడ్ల వెంబడి ఘనస్వాగతం పలికారు. ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. జార్ఖండ్ పర్యటన ముగించుకున్న తరువాత మోదీ బీహార్‌కు వెళ్లారు. పాట్నాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.