PM Modi: ది ఎలిఫెంట్ విస్పర్స్ షార్ట్ ఫిల్మ్ చేసిన మదుమలై అటవీ ప్రాంతానికి రానున్న ప్రధాని మోదీ

|

Apr 09, 2023 | 8:16 AM

మన దేశం నుంచి నామినేట్ అయిన ది ఎలిఫెంట్ విస్పర్స్’ అనే తమిళ డాక్యుమెంటరీ బెస్ట్ డాక్యుమెంటరీ విభాగంలో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే.

PM Modi: ది ఎలిఫెంట్ విస్పర్స్ షార్ట్ ఫిల్మ్ చేసిన మదుమలై అటవీ ప్రాంతానికి రానున్న ప్రధాని మోదీ
Pm Modi
Follow us on

మన దేశం నుంచి ఎలిఫెంట్ విస్పర్స్’ అనే తమిళ డాక్యుమెంటరీ.. బెస్ట్ డాక్యుమెంటరీ విభాగంలో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఆ డాక్యుమెంటరీలో కీలకంగా కనిపించేది మదుమలై పులుల పరిరక్షణ కేంద్రం. అయితే మదుమలై అడవికి ఇవాళ ప్రధాని మోదీ వెళ్లనున్నారు. అందుకోసం నీలగిరి జిల్లా మదుమలై అటవీ ప్రాంతంలో పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు.

అలాగే ది ఎలిఫెంట్ విస్పర్స్ డ్యాకుమెంటరీ షార్ట్ ఫిల్మ్ లో నటించిన బొమ్మన్, వల్లితో పాటు ఏనుగు (రఘు) ని కూడా ప్రధాని కలవనున్నారు. ఇంకో విషయం ఏంటంటే తెప్పకాడు లోని ఏనుగు సంరక్షణ కేంద్రం లో ఉన్న సిబ్బందిని కూడా ఆయన సత్కరించనున్నారు. ఈ షార్ట్ ఫిల్మ్ కి ఆస్కార్ వచ్చాక చాలమంది తెప్పకాడు ఏనుగు శిబిరానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రధాని మోదీ శనివారం తెలంగాణ, తమిళనాడులో పలు అభివృద్ధి పనులుకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆదివారం రోజున కర్నాటకు వెళ్లనున్నారు. అలాగే అక్కడ కూడా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం