Manipur Violence: మణిపుర్‌లో విధ్వంస కాండ.. దెబ్బకు అమాంతం కొండెక్కిన వస్తువుల ధరలు
రిజర్వేషన్ల అంశంపై మణిపుర్‌లో చెలరేగిన అల్లర్లు తీవ్ర హింసాత్మక ఘటనలకు దారితీశాయి. గత మూడు వారాలుగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ రాష్ట్రంలో నిత్యావసరాల ధరలకు రెక్కలొచ్చయాయి. అల్లర్ల వల్ల ఇతర రాష్ట్రాల నుంచి సరకు రవాణా ట్రక్కులను మణిపుర్‌కు నడిపేందుకు డ్రైవర్లు, యజమానులు ఆసక్తి చూపడం లేదు.

రిజర్వేషన్ల అంశంపై మణిపుర్‌లో చెలరేగిన అల్లర్లు తీవ్ర హింసాత్మక ఘటనలకు దారితీశాయి. గత మూడు వారాలుగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ రాష్ట్రంలో నిత్యావసరాల ధరలకు రెక్కలొచ్చయాయి. అల్లర్ల వల్ల ఇతర రాష్ట్రాల నుంచి సరకు రవాణా ట్రక్కులను మణిపుర్‌కు నడిపేందుకు డ్రైవర్లు, యజమానులు ఆసక్తి చూపడం లేదు. దీనివల్ల సరఫరాకు అంతరాయం కలగడంతో పలు వస్తువుల ధరలు రెట్టింపయ్యాయి.
అల్లర్లు చోటుచేసుకున్న ఇంఫాల్ తూర్పు, పశ్చిమ లోయతో పాటు పలు ప్రాంతాల్లో బియ్యం, బంగాళదుంప, ఉల్లిగడ్డ, కోడిగుడ్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అంతకుముందు 50కిలోల బియ్యం ధర రూ.900గా ఉండగా.. ఇప్పుడు రూ. 1800లకు చేరిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే వంటగ్యాస్ సిలిండర్ల సరఫరా ఆగిపోవడంతో బ్లాక్‌మార్కెట్ పెరిగిపోయింది. ఒక్కో సిలిండర్ ధర రూ. ఏకంగా1800లకు పైనే ఉండటం గమనార్హం. ఇక, రాజధాని ఇంఫాల్‌లోని చాలా చోట్ల లీటర్ పెట్రోల్ ధర రూ.170కు పెరిగింది. ఒక్కో కోడిగుడ్డు ధర రూ.10కి చేరగా.. కిలో బంగాళదుంపల ధర రూ.100గా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..




