Presidential Polls 2022 Highlights: ముగిసిన రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్‌ ప్రక్రియ

| Edited By: Subhash Goud

Updated on: Jul 18, 2022 | 6:10 PM

Presidential Polls 2022 Highlights: రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ ముగిసింది.  ఎంపీలు పార్లమెంట్ హౌస్‌కు చేరుకున్న తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పార్లమెంట్ హౌస్‌లోని రూం నంబర్ 63లో 6 బూత్‌లో ఓటు..

Presidential Polls 2022 Highlights: ముగిసిన రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్‌ ప్రక్రియ
Presidential Election 2022

Presidential Polls 2022 Highlights: రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ ముగిసింది.  ఎంపీలు పార్లమెంట్ హౌస్‌కు చేరుకున్న తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పార్లమెంట్ హౌస్‌లోని రూం నంబర్ 63లో 6 బూత్‌లో ఓటు వేశారు. ఇందులో ఒకటి దివ్యాంగ్ ఓటరు. వివిధ రాష్ట్రాలకు చెందిన మొత్తం 9 మంది ఎమ్మెల్యేలు పార్లమెంట్ హౌస్‌లో ఓటు వేయనున్నారు. యూపీ నుంచి 4, త్రిపుర నుంచి 2, అస్సాం నుంచి 1, ఒడిశా నుంచి 1, హర్యానా నుంచి 1 ఉండగా, 42 మంది ఎంపీలు అసెంబ్లీలో ఓటు వేయనున్నారు.  జూలై 21న ఫలితాలు వెలువడిన తర్వాత, కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారోత్సవం జూలై 25, 2022న నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేలు రాష్ట్ర అసెంబ్లీ భవనంలో, ఎంపీలు పార్లమెంట్‌లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్‌కు సంబంధించి ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాల్లో ఏర్పాట్లను పూర్తి చేసింది. ఎన్డీయే తరపున ద్రౌపది ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో ఉన్నారు. తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలపగా.. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీతో పాటు ప్రతిపక్ష టీడీపీ కూడా ద్రౌపది ముర్మును సపోర్ట్ చేస్తున్నాయి.

ఎవరు అర్హులు..

రాష్ట్రపతి అభ్యర్థి తప్పనిసరిగా భారత పౌరుడు అయి ఉండి, 35 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి. ప్రధానిని ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటే.. రాష్ట్రపతిని పరోక్షంగా ఎంపిక చేస్తారు. ప్రజాప్రతినిధులు ఓటు వేసి రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభ సభ్యులకు మాత్రమే ఈ ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుంది. పార్లమెంటు, అసెంబ్లీల్లో నామినేటెడ్‌ సభ్యులు, శాసనమండలి సభ్యులకు ఓటు హక్కు ఉండదు.

ఎంపీలు, ఎమ్మెల్యేల ఓటు విలువ..

మన దేశంలో లోక్‌సభ ఎంపీలు 543, రాజ్యసభ సభ్యులు 233 కలుపుకొని.. మొత్తం 776 ఎంపీలు ఉన్నారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 4,033 మంది ఎమ్మెల్యేలున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి మొత్తం 4,809 మంది. ఎంపీ ఓటు విలువ 700గా.. సగటు ఎమ్మెల్యే ఓటు విలువ 132గా ఉంది. మొత్తంగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలు, ఎమ్మెల్యేల ఓటు విలువ అక్షరాలా.. 10,86,431.

ఎమ్మెల్యేలకు సంబంధించి రాష్ట్రాల్లో 1971 లెక్కల ప్రకారం జనాభా, మొత్తం అసెంబ్లీ సీట్లను పరిగణనలోకి తీసుకుని ఈ విలువను లెక్కించారు. అప్పటికి రాష్ట్ర జనాభాను.. ఎమ్మెల్యేల సంఖ్యను వెయ్యితో మల్టిప్లై చేయగా వచ్చిన సంఖ్యతో డివైడ్‌ చేస్తారు. ఇలా వచ్చిన ఫలితాన్ని ఎమ్మెల్యేల సంఖ్యతో మల్టిప్లై చేసి ఈ రాష్ట్రం మొత్తం ఓటు విలువను లెక్కిస్తారు. ఎమ్మెల్యేల ఓటు విలువ రాష్ట్రానికి రాష్ట్రానికి మారుతుంది. యూపీకి 208గా ఉండగా.. ఝార్ఖండ్, తమిళనాడులో 176, మహారాష్ట్రలో 175, ఏపీ- 159 కాగా.. తెలంగాణ 132గా ఉంది. ఇక ఎంపీలకు సంబంధించి.. దేశంలోని ఎమ్మెల్యేల మొత్తం ఓటు విలువను మొత్తం ఎంపీల సంఖ్య తో డివైడ్‌ చేస్తారు. ఈ మేరకు ఈ సారి ఒక్కో ఎంపీ ఓటు విలువను 700గా లెక్కించారు.

ఎవరు.. ఎక్కడ ఓటు వేస్తారు..

ఎంపీలు పార్లమెంటులో, ఎమ్మెల్యేలు వారి రాష్ట్రంలోని అసెంబ్లీలో ఓటు హక్కు వినియోగించుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో మరెక్కడైనా ఓటు వేయాల్సి వస్తే .. కనీసం పది రోజులు ముందుగా కమిషన్‌ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఓటింగ్‌లో పాల్గొనేవారు రహస్య ఓటింగ్‌ పాటించాలి. బ్యాలెట్‌ను ఎవరికైనా చూపితే ఆ ఓటు చెల్లుబాటు కాదు. బ్యాలెట్‌ బాక్సులు ఢిల్లీ నుంచి రాష్ట్ర రాజధానులకు వెళ్తాయి. ఓటింగ్‌ తర్వాత వాటిని తిరిగి ఢిల్లీకి తరలిస్తారు. రిటర్నింగ్‌ అధికారి సమక్షంలో ఓట్లు లెక్కిస్తారు. ఓటు చెల్లుబాటు కావాలంటే తొలి ప్రాధాన్యత సంఖ్యను తప్పనిసరిగా మార్క్‌ చేయాలి. ప్రథమ ప్రాధాన్యత సంఖ్య వేయకుండా, ఇతర ప్రాధాన్యత నంబర్లు వేస్తే ఆ ఓటు రద్దు అవుతుంది. ఓటింగ్ మార్క్‌ చేయడానికి ఎన్నికల సంఘం ప్రత్యేక పెన్‌ ఇస్తుంది. దాంతో మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుంది.

ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్..

పోల్‌ అయిన మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో 50 శాతం ప్లస్ ఒకటితో.. మొదటి ప్రాధాన్యత ఓట్లను సాధించిన అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రకటిస్తారు. ఈరోజు ఎన్నికలు జరగనుండగా.. జులై 21 కౌంటింగ్ నిర్వహిస్తారు. అందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లును పూర్తి చేసింది. పార్లమెంట్‌తో పాటు అసెంబ్లీల్లోనూ బీజేపీ, వాటి మిత్రపక్షాలకు సంఖ్య ఎక్కువగా ఉండడంతో.. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలిచేందుకే అవకాశమున్నట్టు అంచనా.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 18 Jul 2022 05:12 PM (IST)

    రాష్ట్రపతి ఎన్నికకు ముగిసిన పోలింగ్‌

    రాష్ట్రపతి ఎన్నిక కోసం పోలింగ్‌ ముగిసింది. ఉదయం నుంచి ప్రారంభమైన ఓటింగ్‌.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఆయా రాష్ట్రాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు తమతమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్‌ భవనంలో ఓటింగ్‌ ప్రక్రియ పూర్తయింది. ఈనెల 21న ఓట్ల లెక్కింపు ఉంటుంది. అదే రోజు ఫలితాలు విడుదల కానున్నాయి. ఏపీలో 173 మంది ఓటు వేయగా, తెలంగాణలో 118 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈనెల 26న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

  • 18 Jul 2022 05:07 PM (IST)

    ఉపరాష్ట్రపతి ఎన్నికపై విపక్షాల సమావేశం

    ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఈరోజు సాయంత్రం 6 గంటలకు తన నివాసంలో మరోసారి విపక్షాల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా కూడా హాజరుకానున్నారు.

  • 18 Jul 2022 04:37 PM (IST)

    రాష్ట్ర ప్రయోజనాలను పక్కనబెట్టి ఓటేస్తున్నారు: చలసాని శ్రీనివాస్

    రాష్ట్ర ప్రయోజనాలను పక్కనబెట్టి ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధికి.. వైసీపీ, టీడీపీ ఓటేస్తున్నాయని ఆరోపించారు రాష్ట్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్. ఓవైపు రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతుంటే.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏపీలో పలు రాజకీయ పక్షాలు నిరసన చేపట్టాయి. 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు ఒకే మాట మీద నిలబడి.. ప్రత్యేక హోదా, పోలవరం, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు.

  • 18 Jul 2022 04:19 PM (IST)

    క్రాస్‌ ఓటింగ్‌

    రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. రాష్ట్రపతి అభ్యర్తి యశ్వంత్ సిన్హాకు ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు క్రాస్ ఓటు వేయవచ్చని తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేతలు చెబుతున్నారు. ఈ నేతలు వెస్టిన్ హోటల్‌లో రాత్రులు గడిపారు. రాష్ట్రపతి ఎన్నిక కోసం ఓటింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాతో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము పోటీ చేస్తున్నారు.

  • 18 Jul 2022 04:13 PM (IST)

    ఏపీలో పూర్తయిన రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్‌

    ఏపీలో రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్‌ పూర్తయ్యింది. ఈ ఓటింగ్‌లో 172 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు గైర్హజరయ్యారు. ఇక వైసీపీ ఎమ్మెల్యే మ‌హీధ‌ర్ రెడ్డి రెడ్డి హైదరాబాద్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  • 18 Jul 2022 04:09 PM (IST)

    ఓటింగ్‌లో మమతాబెనర్జీ

    రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్‌లో పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసేందుకు కోల్‌కతా అసెంబ్లీకి వచ్చారు.

  • 18 Jul 2022 04:07 PM (IST)

    రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్‌లో రాహుల్, సోనియా

    కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా రాష్ట్రపతి ఎన్నికల కోసం తమ ఓటు వేశారు. వీరితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్ కూడా ఓటు వేశారు.

  • 18 Jul 2022 04:05 PM (IST)

    రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న కేసీఆర్‌

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీర్‌ రాష్ట్రపతి ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఓటింగ్‌లో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా ఓటు వేశారు.

  • 18 Jul 2022 03:45 PM (IST)

    రాష్ట్రపతి ఎన్నికలు: వీల్ చైర్‌పై వచ్చి ఓటు వేసిన మన్మోహన్ సింగ్

    రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మాజీ ప్రధాని, కాంగ్రెస్ ఎంపీ మన్మోహన్ సింగ్ వీల్ చైర్‌పై పార్లమెంటుకు వచ్చి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేశారు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

  • 18 Jul 2022 03:21 PM (IST)

    రాష్ట్రపతి ఎన్నికలను బహిష్కరించిన అకాలీదళ్ ఎమ్మెల్యే

    అకాలీదళ్ ఎమ్మెల్యే మన్‌ప్రీత్ సింగ్ అయాలీ రాష్ట్రపతి ఎన్నికలను బహిష్కరించారు. దీనికి సంబంధించిన వీడియోను ఫేస్‌బుక్‌లో షేర్ చేస్తూ సమాచారం అందించాడు. 1984 సిక్కుల ఊచకోత, ఆపరేషన్ బ్లూస్టార్, సిక్కుల హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన కాంగ్రెస్ అభ్యర్థికి తాను ఓటు వేయలేనని అన్నారు. పంజాబ్ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్‌పై విశ్వాసం లేదని ఆయన అన్నారు.

  • 18 Jul 2022 03:11 PM (IST)

    ఎన్నికల్లో ఓటు వేసిన కేంద్ర మంత్రులు

    రాష్ట్రపతి ఎన్నికల్లో కేంద్ర మంత్రులు మన్సుఖ్ మాండవ్య, హర్దీప్ సింగ్ పూరీ, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, NCP అధినేత శరద్ పవార్‌లు ఢిల్లీలో ఓటు వేశారు.

  • 18 Jul 2022 03:09 PM (IST)

    ఓటు హక్కును వినియోగించుకున్న రాజ్‌నాథ్ సింగ్‌

    రాష్ట్రపతి ఎన్నికల్లో పలువురు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి ఎన్నికల కోసం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సింగ్ సూర్జేవాలా, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ తమ ఓటు వేశారు.

  • 18 Jul 2022 02:38 PM (IST)

    ద్రౌపది ముర్ము తప్పకుండా గెలుస్తారు

    ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తారని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ అన్నారు. ఆయన ఈ ఎన్నికలో ఓటు హక్కును వినియోగించుకుని మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము చారిత్రాత్మక విజయం సాధిస్తారు. గిరిజన మహిళను రాష్ట్రపతిని చేయాలని ప్రతినిధులంతా నిర్ణయించారు. అందరు కూడా మద్దతు పలుకుతున్నారని అన్నారు.

  • 18 Jul 2022 02:34 PM (IST)

    ఓటు హక్కు వినియోగించుకున్న ముఖ్యమంత్రులు

    అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ రాష్ట్రపతి ఎన్నిక కోసం అసెంబ్లీలో ఓటు వేశారు. అలాగే కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, స్మృతి ఇరానీ పార్లమెంట్‌లో ఓటు వేశారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ రాయ్‌పూర్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో ఓటు వేశారు.

  • 18 Jul 2022 02:16 PM (IST)

    వంద మందికి పైగా ఎమ్మెల్యేలు..

    తెలంగాణలో ఇప్పటివరకూ వంద మందికి పైగా ఎమ్మెల్యేలు ఓటు వేశారు. టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఓటు వేశారు. కరోనా పాజిటివ్‌ రావడంతో సాయంత్రం 4 నుంచి ఐదు గంటల మధ్యలో మంత్రి గంగుల కమలాకర్‌ ఓటు వేస్తారు.

  • 18 Jul 2022 01:39 PM (IST)

    పొరపాటున ద్రౌపది ముర్ముకు ఓటు వేసిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క..

    దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్‌ ప్రక్రియ జరుగుతోంది. తెలంగాణలో ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఓటు వేసి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క తన ఓటింగ్‌‌లో చిన్న పొరపాటు చేశారు. ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు కాకుండా ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఆమె ఓటేశారు. వెంటనే సవరించుకున్న సీతక్క.. తాను పొరపాటున ముర్ముకు ఓటు వేసినట్టు అధికారులకు సీతక్క తెలిపారు. ఈ క్రమంలో మళ్లీ ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలని అధికారులను కోరారు. అయితే.. నిబంధనల ప్రకారం మరోసారి అవకాశం ఇవ్వలేమని అధికారులు సీతక్కకు తేల్చి చెప్పారు. అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ విషయాన్ని సీతక్క మీడియాకు వివరించారు.

  • 18 Jul 2022 12:05 PM (IST)

    ఓటు వేయడంలో పొరపాటు చేసిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క

    రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క పొరపాటు చేశారు. బాక్సులో బ్యాలెట్‌ పేపర్‌ వేయకముందే గమనించి ఆమె.. మరో బ్యాలెట్‌ పేపర్‌ ఇవ్వాలని అడిగారు. దీంతో మరో బ్యాలెట్‌ పేపర్‌ ఇవ్వొచ్చా? లేదా? అనే విషయాన్ని రిటర్నింగ్‌ అధికారి పరిశీలిస్తున్నారు.

  • 18 Jul 2022 11:38 AM (IST)

    నేను అందుకే ఆయనకు ఓటు చేస్తున్నారు.. - అఖిలేష్ యాదవ్

    తాను విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు అనుకూలంగా ఓటు వేసున్నట్లుగా తెలిపారు ఎస్పీ అధినేత, ఎమ్మెల్యే అఖిలేష్ యాదవ్. దేశంలో ఆర్థిక పరిస్థితిని ఎప్పటికప్పుడు చెప్పగలిగే వ్యక్తి ఎవరైనా ఉండాలన్నారు. శ్రీలంక పరిస్థితి మనం ఇప్పుడు చూస్తున్నామన్నారు.. కాబట్టి ప్రెసిడెంట్ అప్పుడప్పుడు ఇలా చెప్పగలిగేలా ఉండాలి.

  • 18 Jul 2022 11:32 AM (IST)

    వీల్ చైర్ లో వచ్చి ఓటు వేసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

    భారత రాష్ట్రపతి పదవికి జరుగుతున్న ఎన్నికల్లో మాజీ ప్రధాని, కాంగ్రెస్ ఎంపీ మన్మోహన్ సింగ్ పార్లమెంటులో ఓటు వేశారు. ఓటు వేసేందుకు మన్మోహన్ సింగ్ వీల్ చైర్ లో వచ్చారు.

  • 18 Jul 2022 11:28 AM (IST)

    బీజేపీ ఎంపీ హేమ మాలిని పార్లమెంట్‌లో ఓటు

    భారత కొత్త రాష్ట్రపతిని ఎన్నికల్లో బీజేపీ ఎంపీ హేమ మాలిని పార్లమెంట్‌లో ఓటు వేశారు.

  • 18 Jul 2022 11:09 AM (IST)

    బీజేపీ క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలుసన్నారు- అఖిలేష్ యాదవ్

    సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొని ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన అఖిలేష్.. బీజేపీ క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలుసన్నారు. ఎస్పీ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉంటే వారి జాబితాను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించడం బీజేపీ కంటే గొప్పగా ఎవరికీ తెలియదన్నారు.

  • 18 Jul 2022 11:06 AM (IST)

    ఓటింగ్‌కు దూరంగా బాలకృష్ణ, బుచ్చయ్య చౌదరి.. ఏపీలో కొనసాగుతున్న పోలింగ్‌..

    రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ఆంధ్రప్రదేశ్‌లో నడుస్తోంది. ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, బుచ్చయ్య చౌదరి. విదేశాల్లో ఉన్న కారణంగా ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.

  • 18 Jul 2022 11:00 AM (IST)

    రాష్ట్రపతి ఎన్నికల్లో డబ్బు ప్రలోభాలు నడుస్తున్నాయి.. - విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా

    విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో డబ్బు ప్రలోభాలు నడుస్తున్నాన్నారు విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా. ఆత్మ ప్రభోధానుసారం తనకు ఓటేయాలని యశ్వంత్ సిన్హా కోరారు. వారు పార్టీలను విచ్ఛిన్నం చేస్తున్నారు. వారికి ఓటు వేయమని ప్రజలను బలవంతం చేస్తున్నారు. ఇందులో మనీ గేమ్స్ కూడా ఉన్నాయి.

  • 18 Jul 2022 10:47 AM (IST)

    వేటు వేసిన ఏపీ సీఎం జగన్..

    రాష్ట్రపతి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  • 18 Jul 2022 10:40 AM (IST)

    ద్రౌపది ముర్ము గెలుపు ఖాయం..

    బీజేపీ- ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలుపు ఖాయమని మహారాష్ట్ర బీజేపీ అభ్యర్థి ఆశిష్ షెలార్ అన్నారు. ఆమెకు మహారాష్ట్ర నుంచి రికార్డు స్థాయిలో ఓట్లు వస్తాయని విశ్వసం వ్యక్తం చేశారు.

  • 18 Jul 2022 10:21 AM (IST)

    ఓటు వేసిన గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్..

    భారత రాష్ట్రపతి పదవికి ఎన్నికల సందర్భంగా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గాంధీనగర్‌లో ఓటు వేశారు.

  • 18 Jul 2022 10:19 AM (IST)

    ఓటు వేసిన ప్రధాని మోదీ..

    రాష్ట్రపతి ఎన్నిక కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఓటు వేశారు.

  • 18 Jul 2022 10:17 AM (IST)

    ఓటు వేసిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్

    తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెన్నైలో ఓటు వేశారు.

  • 18 Jul 2022 10:14 AM (IST)

    ప్రారంభమైన ఓటింగ్.. ఓటు వేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

    రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీకి చేరుకుని ఓటు వేశారు.

  • 18 Jul 2022 09:26 AM (IST)

    పార్లమెంట్ హౌస్‌లోని రూమ్ నంబర్ 63లో ఓటింగ్ జరగనుంది

    రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ ఈరోజు ఉదయం 10 గంటలకు పార్లమెంట్ హౌస్‌లోని రూమ్ నంబర్ 63లో ప్రారంభమవుతుంది. శాసనసభ్యులు రాష్ట్ర అసెంబ్లీలలో ఓటు వేయనున్నారు.

  • 18 Jul 2022 09:24 AM (IST)

    మీ మనస్సాక్షి చెప్పేది మాత్రమే వినండి..

    ఎన్నికలకు ముందు ప్రతిపక్షల అభ్యర్థి యశ్వంత్ సిన్హా ట్వీట్ చేశారు.  'మీ మనస్సాక్షి చెప్పేది విని నాకు ఓటు వేయండి' అని ట్వీట్ చేశారు.

  • 18 Jul 2022 09:20 AM (IST)

    ఇద్దరు వ్యక్తుల మధ్య.. రెండు సిద్ధాంతాల మధ్య పోటీ..

    విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ట్వీట్‌ చేశారు. ఈ ఏడాది రాష్ట్రపతి ఎన్నికలు ఇద్దరు వ్యక్తుల మధ్య కాదు, రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్నాయి. మన రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధనలను, విలువలను కాపాడాలని ఒక పార్టీ మాత్రమే కోరుకుంటోంది. ఈసారి రాజ్యాంగంపై, వారి మనస్సాక్షిపై ఓటు వేయాలని ఎంపీలు, ఎమ్మెల్యేలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.

  • 18 Jul 2022 08:46 AM (IST)

    తెలంగాణ అసెంబ్లీలో ప్రత్యేక ఏర్పాట్లు..

    తెలంగాణ అసెంబ్లీలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు,. తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డితో పాటు 119 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయనున్నారు. కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి. ప్రత్యేక అనుమతితో తెలంగాణ అసెంబ్లీలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

  • 18 Jul 2022 08:45 AM (IST)

    టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించనున్న మంత్రి కేటీఆర్‌

    రాష్ట్రపతి ఎన్నికలపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు మంత్రి కేటీఆర్‌ అవగాహన కల్పించనున్నారు. తెలంగాణ భవన్‌కు ఇప్పటికే ఎమ్మెల్యేలు చేరుకున్నారు. వారికి మాక్‌ పోలింగ్‌తో మంత్రి కేటీఆర్‌ వివరిస్తారు. ఆ తర్వాత బస్‌లో ఎమ్మెల్యేలందరూ కలిసి అసెంబ్లీకి వస్తారు. ఆ తర్వాత ఒక్కో ఎమ్మెల్యే ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

  • 18 Jul 2022 08:32 AM (IST)

    5వ రాష్ట్రపతి ఎన్నికకు ఇవాళ ఓటింగ్..

    15వ రాష్ట్రపతి ఎన్నికకు ఇవాళ ఓటింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల ఎంపీలు, ఎమ్మెల్యేలు కొత్త రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు ఓటు వేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది.

  • 18 Jul 2022 08:29 AM (IST)

    రాష్ట్రపతి అభ్యర్థి విజయాన్ని ఎలా నిర్ణయిస్తారంటే..

    రాష్ట్రపతి ఎన్నికల్లో పోల్‌ అయిన మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో 50 శాతం ప్లస్ ఒకటితో.. మొదటి ప్రాధాన్యత ఓట్లను సాధించిన అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రకటిస్తారు. ఈరోజు ఎన్నికలు జరగనుండగా.. జులై 21 కౌంటింగ్ నిర్వహిస్తారు. అందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లును పూర్తి చేసింది. పార్లమెంట్‌తో పాటు అసెంబ్లీల్లోనూ బీజేపీ, వాటి మిత్రపక్షాలకు సంఖ్య ఎక్కువగా ఉండడంతో.. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలిచేందుకే అవకాశమున్నట్టు అంచనా.

  • 18 Jul 2022 08:26 AM (IST)

    నెంబర్ గేమ్‌లో ద్రౌపది ముర్ము ఎలా గెలస్తారంటే..

    రాష్ట్రపతి రేసులో ద్రౌపది ముర్ముకు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతెందుకు ఇది ఎలా గెలుస్తారో లెక్కల్లో చూద్దాం..  - రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం 10 లక్షల 81 వేల 991 ఓట్లు ఉన్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన మెజారిటీ సంఖ్య 5 లక్షల 40 వేల 996. 

  • 18 Jul 2022 08:21 AM (IST)

    విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాకు ఎన్ని ఓట్లు పడనున్నాయంటే..

    మరోవైపు ప్రత్యర్థి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు దాదాపు లక్షా ముప్పై ఏడు వేల ఓట్లతో కాంగ్రెస్ మద్దతునిస్తూ అతిపెద్ద పార్టీగా అవతరించింది. తృణమూల్‌కు 58 వేలకు పైగా ఓట్లు ఉన్నాయి. డీఎంకేకు దాదాపు 45 వేల ఓట్లు, ఎస్పీకి 27 వేలకు పైగా ఓట్లు ఉన్నాయి. టీఆర్‌ఎస్‌కు 24 వేలకు పైగా ఓట్లు, ఆప్‌కు దాదాపు 21 వేల ఓట్లు, ఇతరులకు 88 వేల 212 ఓట్లు అంటే మొత్తం 4 లక్షల 13 వేల 728 ఓట్లు ఉన్నాయి.

    ఇతరులలో NCP, RJD, CPI, CPIM, AIMIM ఉన్నాయి. ఇప్పుడు ఈ లెక్కలను పోల్చి చూస్తే ముర్ముకు అనుకూలంగా 6 లక్షల 66 వేల 28 ఓట్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి యశ్వంత్ సిన్హాకు అనుకూలంగా 4 లక్షల 13 వేల 728 ఓట్లు వచ్చాయి. కాగా మెజారిటీకి 5 లక్షల 40 వేల 996. అంటే అత్యున్నత రాజ్యాంగ పదవికి చేరుకున్న తొలి గిరిజన మహిళగా ద్రౌపది ముర్ము నిలవవచ్చని లెక్కలు చెబుతున్నాయి.

  • 18 Jul 2022 08:19 AM (IST)

    రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఎన్ని పార్టీలు మద్దతుగా ఉన్నాయంటే..

    దాదాపు నాలుగున్నర లక్షల ఓట్లు ఉన్న బీజేపీ.. ద్రౌపది ముర్ముని అభ్యర్థిగా చేసింది. అదే సమయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు చెందిన దాదాపు నలభై ఐదు వేల ఓట్లు కూడా ఆమెకే పడనున్నాయి. బిజెడికి ముప్పై వేల ఓట్లు ఉన్నాయి. మరోవైపు జేడీయూ 14 వేలకు పైగా ఓట్లతో ముర్ముతో పాటు ఇతరులకు 93 వేల ఓట్లు ఉన్నాయి. అంటే మొత్తం- 6 లక్షల 66 వేల 28 ఓట్లు ముర్ముకు మద్దతు ఉన్నట్లుగా కనిపిస్తోంది. శివసేనలో ఉద్ధవ్ వర్గం, షిండే వర్గం, JD(S), BSP, జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM), అకాలీదళ్, SBSP కూడా ద్రౌపది ముర్మునికు మద్దతుగా నిలిచాయి.  

  • 18 Jul 2022 08:10 AM (IST)

    విపక్షాల అభ్యర్థికి కాంగ్రెస్, తృణమూల్‌, డీఎంకే, ఎస్పీ మద్దతు..

    విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు దాదాపు లక్షా ముప్పై ఏడు వేల ఓట్లతో కాంగ్రెస్ మద్దతునిచ్చిన అతిపెద్ద పార్టీ. తృణమూల్‌కు 58 వేలకు పైగా ఓట్లు ఉన్నాయి. డీఎంకేకు దాదాపు 45 వేల ఓట్లు, ఎస్పీకి 27 వేలకు పైగా ఓట్లు ఉన్నాయి.

  • 18 Jul 2022 07:55 AM (IST)

    ఉదయం 10 గంటలకు ఓటు వేయనున్న సీఎం జగన్

    రాష్ట్రపతి ఎన్నికకు ఏపీ అసెంబ్లీలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి ఎమ్మెల్యే లకు మాక్ పోలింగ్ నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ఓటింగ్ ప్రారంభం కానుంది. ఓటు హక్కు వినియోగించుకొనున్న వైసీపీ, టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు. ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయనున్న సీఎం జగన్. ఉదయం 11.45 కి ఓటు వేయనున్న చంద్రబాబు. హైదరాబాద్‌లో టీఎస్ అసెంబ్లీలో ఓటు వేయనున్న కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి. ఏపీ నుంచి 175 ఎమ్మెల్యే ల మద్దతు ఎన్డీయే అభ్యర్థి మురుముకు ప్రకటించిన పార్టీలు అన్ని పార్టీలు.

  • 18 Jul 2022 07:47 AM (IST)

    ఓటింగ్‌లో దివ్యాంగ్‌కు స్పెషల్ బూత్..

    పార్లమెంట్ హౌస్‌లోని రూం నంబర్ 63లో 6 బూత్‌లను ఏర్పాటు చేశారు. ఇందులో ఒకటి దివ్యాంగ్ ఓటరు. వివిధ రాష్ట్రాలకు చెందిన మొత్తం 9 మంది ఎమ్మెల్యేలు పార్లమెంట్ హౌస్‌లో ఓటు వేయనున్నారు.

Published On - Jul 18,2022 7:45 AM

Follow us
Latest Articles