అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో పోలీసులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. సుమారు 60 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఒక నిందితుడిని అరెస్టు చేశారు. ఒడిశా నుంచి బెంగళూరుకు అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. అరెస్ట్ అయిన వ్యక్తి ఇచ్చిన సమాచారంతో మిగిలిన ముఠా సభ్యుల కోసం గాలిస్తున్నారు.