Shipping Corporation Of India Jobs 2022: రూ.160000ల జీతంతో.. షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు..

భారత ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్‌, జలమార్గాల మంత్రిత్వశాఖకు చెందిన ముంబయిలోని షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (Shipping Corporation of India Limited).. ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్‌ మేనేజర్..

Shipping Corporation Of India Jobs 2022: రూ.160000ల జీతంతో.. షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు..
Sci
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 18, 2022 | 7:56 AM

Shipping Corporation Of India Ltd Assistant Manager Recruitment 2022: భారత ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్‌, జలమార్గాల మంత్రిత్వశాఖకు చెందిన ముంబయిలోని షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (Shipping Corporation of India Limited).. ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్‌ మేనేజర్ (Assistant Manager Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 46

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ మేనేజర్ పోస్టులు

విభాగాలు: మేనేజ్‌మెంట్‌, ఫైనాన్స్, హెచ్‌ఆర్‌, లా, ఫైర్‌ అండ్‌ సెక్యూరిటీ, సివిల్‌ ఇంజినీరింగ్‌, సీఎస్‌ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు మే 1, 2022 నాటికి 27 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.50,000ల నుంచి రూ.1,60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో లా, బీఈ/బీటెక్‌/ఎంబీఏ/ఎంఎంఎస్‌/కంపెనీ సెక్రెటరీ/సీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • జనరల్ అభ్యర్ధులకు: రూ.500
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు: రూ.100

దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 16, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.