Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajasthan Election: నామినేషన్‌ దాఖలు చేసిన మాజీ సీఎం వసుంధర రాజే.. ఝలావర్ బీజేపీ భారీ బల ప్రదర్శన

భారతీయ జనతా పార్టీ ముఖ్యనేత మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఝలావర్ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఎన్నికల శంఖారావాన్ని పూరించారు వసుంధర రాజే. కోటా సమస్య పరిష్కారం కావడంతో బీజేపీ బలం మరింత పుంజుకుందని వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజారిటీతో విజయం సాధించడం ఖాయమన్నారు. వసుంధర రాజేతో పాటు ప్రమోద్ జైన్ భాయా కూడా నామినేషన్ దాఖలు చేశారు.

Rajasthan Election: నామినేషన్‌ దాఖలు చేసిన మాజీ సీఎం వసుంధర రాజే.. ఝలావర్ బీజేపీ భారీ బల ప్రదర్శన
Vasundhara Raje
Follow us
Balaraju Goud

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 04, 2023 | 5:32 PM

రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల సీజన్ రసవత్తరంగా సాగుతోంది. నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుండటంతో అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే భారతీయ జనతా పార్టీ ముఖ్యనేత మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఝలావర్ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఎన్నికల శంఖారావాన్ని పూరించారు వసుంధర రాజే. కోటా సమస్య పరిష్కారం కావడంతో బీజేపీ బలం మరింత పుంజుకుందని వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజారిటీతో విజయం సాధించడం ఖాయమన్నారు. వసుంధర రాజేతో పాటు ప్రమోద్ జైన్ భాయా కూడా నామినేషన్ దాఖలు చేశారు. వసుంధర రాజే నామినేషన్ ర్యాలీకి భారీ సంఖ్యలో జనం తరలించి వచ్చారు. పార్టీ కార్యకర్తలు నృత్యాలు చేస్తూ, పాడుతూ ర్యాలీలో పాల్గొన్నారు.

నామినేషన్‌కు ముందు, వసుంధర రాజే ఝలావర్‌లోని రాడి బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, దేవుని ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం మానస పూర్ణ హనుమాన్‌జీ ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. ఆ తర్వాత రిటర్నింగ్ కార్యాలయంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో పాటు రాజస్థాన్ బీజేపీ ముఖ్య నాయకలు వెంట రాగా నామినేషన్ ఫారమ్‌ను దాఖలు చేశారు. ఇందుకు సంబంధించి ప్రహ్లాద్ జోషి తన అధికారిక X ఖాతాలో చిత్రాలతో పాటు ఈ సమాచారాన్ని పంచుకున్నారు.

ఈ సందర్భంగా వసుంధర రాజే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజస్థాన్ పునర్నిర్మిస్తామని, కమలం మళ్లీ వికసిస్తుందని, గత బీజేపీ ప్రభుత్వాల హయాంలో జరిగినట్లే అభివృద్ధి జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లక్షలాది మంది యువత కలలను నాశనం చేసిందని వసుంధర రాజే ఆరోపించారు. ఈ ప్రభుత్వ హయాంలో మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాల పెరిగి, దేశంలోనే నెంబర్ వన్‌గా ఉందన్నారు. దళితుల అఘాయిత్యాలలో నెంబర్ వన్, అవినీతిలో నెంబర్ వన్, పేపర్ లీకేజీలలో నెంబర్ వన్, అప్పుల్లో నెంబర్ వన్, నిరుద్యోగంలో నెంబర్ వన్, ద్రవ్యోల్బణంలో నెంబర్ వన్, హిందువులలో నంబర్ వన్, సాధువులపై అఘాయిత్యాలలో నంబర్ వన్, తప్పుడు వాగ్దానాలలో నంబర్ వన్ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు వసుంధర రాజే.

ఒకవైపు, గరీబ్ కళ్యాణ్, జన్ ధన్, ఆయుష్మాన్, ఉజ్వల, కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా కోట్లాది దేశవాసుల జీవితాలను, రామ మందిర నిర్మాణ కలను సాకారం చేసిన ప్రధాని మోదీ ఉన్నారు. మరోవైపు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఉంది. రోజూ 20 అత్యాచారాలు, 7 హత్యలు, 19 సార్లు పేపర్లు లీక్ చేసి లక్షలాది మంది యువత జీవితాలతో ఆడుకున్న ప్రభుత్వం ఉంది. ఏ సర్కార్ కావాలో మీరే ఎంచుకోవాలని సూచించారు వసుంధర రాజే.

వసుంధర రాజేకు ఝలావర్ నుంచి ఇది నా 10వ నామినేషన్. 1989 నవంబర్‌లో ఎంపీకి తొలి నామినేషన్‌ దాఖలు చేశారు. 5 సార్లు ఎంపీగా, 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎంపీ దుష్యంత్ సింగ్ వరుసగా 4 సార్లు ఎంపీ అయ్యారు. ఝల్వాద్ ఆశీస్సులతో ఆమె 1998లో కేంద్రంలో విదేశాంగ మంత్రి అయ్యారు. ఆ తర్వాత, ఆమె చిన్న పరిశ్రమలు, వ్యవసాయం మరియు గ్రామీణ పరిశ్రమలు, సిబ్బంది, పబ్లిక్ గ్రీవెన్స్, అణుశక్తి, కేంద్రంలో అంతరిక్షం వంటి ముఖ్యమైన శాఖల మంత్రి అయ్యారు. ఆమె 2003 2013లో అపూర్వమైన మెజారిటీతో రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిగా వసుంధర రాజే బాధ్యతలు నిర్వహించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..