AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర్ణాటకలోనూ జనాభా అదుపు పాలసీని ప్రవేశపెట్టాల్సిందే ..బీజేపీ నేత సి.టి. రవి డిమాండ్

కర్ణాటకలో జాతీయ జనాభా అదుపు పాలసీని ప్రవేశ పెట్టాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సి.టి. రవి అన్నారు. యూపీ, అస్సాం తరహాలో పాపులేషన్ కంట్రోల్ పాలసీ ఇక్కడ అవసరమని ఆయన చెప్పారు. ఆ రాష్ట్రాల బాటలోనే కర్ణాటక ప్రభుత్వం కూడా అదే మార్గాన్ని అనుసరించాలని

కర్ణాటకలోనూ జనాభా అదుపు పాలసీని ప్రవేశపెట్టాల్సిందే ..బీజేపీ నేత సి.టి. రవి డిమాండ్
Population Policy In Karnataka Too Says Bjp Leader,karnataka, Banguluru,population Policy,c.t.ravi,up,assam.
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Jul 13, 2021 | 7:59 PM

Share

కర్ణాటకలో జాతీయ జనాభా అదుపు పాలసీని ప్రవేశ పెట్టాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సి.టి. రవి అన్నారు. యూపీ, అస్సాం తరహాలో పాపులేషన్ కంట్రోల్ పాలసీ ఇక్కడ అవసరమని ఆయన చెప్పారు. ఆ రాష్ట్రాల బాటలోనే కర్ణాటక ప్రభుత్వం కూడా అదే మార్గాన్ని అనుసరించాలని మాజీ ఆరోగ్య శాఖ మంత్రి కూడా అయిన రవి పేర్కొన్నారు. మన ప్రకృతి వనరులు పరిమితంగా ఉన్నాయని, జనాభా పెరిగితే ప్రతి వ్యక్తికీ అవి లభించబోవని అయన చెప్పారు. ఇప్పటికే చాలా సమయం మించిపోయిందన్నారు. యూపీలో అప్పుడే జనాభా అదుపు పాలసీని ఆ రాష్ట్ర సీఎం ప్రకటించడమే కాక అక్కడి ప్రభుత్వం ఓ ముసాయిదా బిల్లును కూడా రూపొందించిందన్నారు. ఈ బిల్లుపై ఈ నెల 19 లోగా ప్రజల నుంచి సూచనలు కోరిందన్నారు. జనాభా పెరుగుదల అన్నది మంచిది కాదని, దీనిపై నిపుణులు తమ సలహాలు ఇవ్వాలని రవి కోరారు.

అటు రాష్ట్రంలో ఈ పాలసీని అమలు చేసే విషయంలో పలు వర్గాలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని హోమ్ మంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు.కాగా–రానున్న పార్లమెంట్ సమావేశాల్లో పాపులేషన్ కంట్రోల్, ఉమ్మడి సివిల్ కోడ్ పై బీజేపీ ఎంపీలు తమ ప్రైవేటు బిల్లులను ప్రవేశ పెడతారని తెలుస్తోంది. ఇలా ఉండగా మరో బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వం కూడా జనాభా అదుపు పై చట్టం తేవాలని యోచిస్తున్నట్టు తెలియవచ్చింది. ఇందుకు సంబంధించి త్వరలో ఆయా వర్గాలతో చర్చలు జరపాలని భావిస్తున్నట్టు సమాచారం.

మరిన్ని ఇక్కడ చూడండి : TPCC కోసం 50కోట్లు ఇచ్చింది నిజం కాదా..?రేవంత్ రెడ్డి పై కామెంట్స్ చేసిన కౌశిక్ రెడ్డి..:50 crores for TPCC Video.

 మహబూబాబాద్‌లో పోడు పోరాటం.. ఫారెస్ట్ అధికారులను చితకబాదిన స్థానికులు..:Forest Officials Video.

 కత్తి మహేష్ మృతిపై అనుమానాలు.. వెలుగులోకి సంచలన విషయాలు.లైవ్ వీడియో :Kathi Mahesh Death Live Video.

 స్కూల్ విద్యార్థులకు కండోమ్స్ కొత్త సెక్స్ ఎడ్యుకేషన్ పాలసీ..సంచలన నిర్ణయం:Condoms To Students Video.