PM Modi: నేడు మోర్బీ కేబుల్‌ బ్రిడ్జిని పరిశీలించనున్న ప్రధాని మోడీ.. బాధిత కుటుంబాలకు పరామర్శ

|

Nov 01, 2022 | 8:12 AM

ఈ విషాద దుర్ఘటనపై ఐదుగురు సభ్యులతో కూడిన సిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నిన్న, ఐదుగురు సభ్యుల దర్యాప్తు కమిటీ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని, విరిగిన కేబుల్ వంతెనపై  విచారణ ప్రారంభించింది.

PM Modi: నేడు మోర్బీ కేబుల్‌ బ్రిడ్జిని పరిశీలించనున్న ప్రధాని మోడీ.. బాధిత కుటుంబాలకు పరామర్శ
Pm Narendra Modi
Follow us on

గుజరాత్‌లో మోర్బీ కేబుల్‌ బ్రిడ్జి కూలి సుమారు 141 మంది ప్రాణాలు కోల్పోయారు. ఛత్‌ పూజలు చేస్తోన్న సమయంలో జరిగిన ఈ ఘోర ప్రమాదం దేశం మొత్తాన్ని కలవరపాటుకు గురి చేసింది. ఈ ప్రాంతాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు పరిశీలించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం మోర్బీ వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. అలాగే బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. ఈ మేరకు గుజరాత్‌ ముఖ్యమంత్రి కార్యాలయం వివరాలు వెల్లడించింది. ఈ మేరకు సోమవారమే (అక్టోబర్‌ 31)గుజరాత్‌ ముఖ్యమంత్రి కార్యాలయం వివరాలు వెల్లడించింది. కాగా మోర్బీలోని మచ్చు నదిపై ఉన్న బ్రిటిష్‌ కాలం నాటి తీగల వంతెన ఆదివారం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 141 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది గల్లంతయ్యారు.  కాగా ఈ విషాద దుర్ఘటనపై ఐదుగురు సభ్యులతో కూడిన సిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నిన్న, ఐదుగురు సభ్యుల దర్యాప్తు కమిటీ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని, విరిగిన కేబుల్ వంతెనపై  విచారణ ప్రారంభించింది. మరోవైపు  ఇదే  కేసులో పోలీసులు త్వరితగతిన చర్యలు చేపట్టి 9 మంది నిందితులను అరెస్ట్ చేశారు.

సుప్రీంలో పిల్‌..

మరోవైపు ఈ ఘటనపై సుప్రీంకోర్టులో పిల్‌ దాఖలైంది. సుప్రీంకోర్టు న్యాయవాది విశాల్ తివారీ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఘటనపై రిటైర్డ్ జడ్జి అధ్యక్షతన సిట్ బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. అదే సమయంలో, దేశవ్యాప్తంగా ఉన్న పాత వంతెనలపై ఎక్కువ మంది గుమిగూడకుండా, ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా కఠిన నిబంధనలు రూపొందించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. మోర్బీ విషాదం తర్వాత ద్వారకలో వ్యవస్థను అప్రమత్తం చేస్తున్నారు. గోమఘాట్ సమీపంలోని సుదామ సేతును కలెక్టర్ ఆదేశాల మేరకు వెంటనే మూసివేశారు. ద్వారకలోని ఆలయాన్ని సందర్శించే భక్తులు క్రమం తప్పకుండా సుదామ సేతుని సందర్శిస్తున్నారు. దీంతో ఈ పాత వంతెనపై యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉంటోందవి. ఈ నేపథ్యంలో యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, సుదామ సేతును మూసివేయాలని సర్కారు నిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..