PM Modi: వారి కృషి అభినందనీయం.. ఢిల్లీలో జనశక్తి ఎగ్జిబిషన్‌ను సందర్శించిన ప్రధాని మోడీ..

|

May 14, 2023 | 8:18 PM

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ (NGMA) ని సందర్శించి జనశక్తి ప్రదర్శనను వీక్షించారు. ప్రధాని మోదీ మన్ కీ బాత్‌లో ప్రస్తావించిన పరిశుభ్రత, నీటి సంరక్షణ, వ్యవసాయం, అంతరిక్షం, ఈశాన్య ప్రాంతం, మహిళా సాధికారత, యోగా, ఆయుర్వేదం వంటి అంశాలపై ప్రముఖ భారతీయ కళాకారుల రూపొందించిన టాప్ పెయింటిగ్స్ ను వీక్షించారు.

PM Modi: వారి కృషి అభినందనీయం.. ఢిల్లీలో జనశక్తి ఎగ్జిబిషన్‌ను సందర్శించిన ప్రధాని మోడీ..
Pm Modi
Follow us on

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ (NGMA) ని సందర్శించి జనశక్తి ప్రదర్శనను వీక్షించారు. ప్రధాని మోదీ మన్ కీ బాత్‌లో ప్రస్తావించిన పరిశుభ్రత, నీటి సంరక్షణ, వ్యవసాయం, అంతరిక్షం, ఈశాన్య ప్రాంతం, మహిళా సాధికారత, యోగా, ఆయుర్వేదం వంటి అంశాలపై ప్రముఖ భారతీయ కళాకారుల రూపొందించిన టాప్ పెయింటిగ్స్ ను వీక్షించారు. ఆర్టిస్ట్ మాధవి పరేఖ్, అతుల్ దోడియా, పద్మశ్రీ అవార్డు గ్రహీత పరేష్ మైతీ, సమకాలీన కళాకారుడు ఈరన్న జిఆర్, జగన్నాథ్ పాండాతో సహా పలువురు కళాకారులు.. జనశక్తికి తమ కళాఖండాలను అందించారు. అయితే, తమ సృజనాత్మకతతో ప్రదర్శనను సుసంపన్నం చేసిన కళాకారులందరి కృషిని ప్రధాని మోడీ ట్విటర్‌లో షేర్‌ చేసి.. అభినందించారు.

Pm Modi

”నేను ఢిల్లీ NGMAను సందర్శించాను. ఇది మన్ కీ బాత్ ఎపిసోడ్‌లలోని కొన్ని థీమ్‌ల ఆధారంగా అద్భుతమైన కళాఖండాల ప్రదర్శన. తమ సృజనాత్మకతతో ప్రదర్శనను సుసంపన్నం చేసిన కళాకారులందరినీ అభినందిస్తున్నాను” అని ప్రధాని ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

అంతకుముందు ప్రధాని మోడీ.. ఏప్రిల్ 30న ప్రధాని మోదీ మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్‌లో ప్రసంగించారు. మన్‌ కీ బాత్‌.. తనకు ఆధ్యాత్మిక యాత్ర అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మన్‌కీ బాత్‌ మాధ్యమం ద్వారా ప్రజలు ఇతర పౌరుల రచనలను నేర్చుకుని స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో అభివృద్ధి చెందాలని సూచించారు.

Pm Narendra Modi

మన్ కీ బాత్ ద్వారా చిన్న వ్యాపారాల గురించి మాట్లాడిన ప్రధాని మోదీ.. తాను లేవనెత్తిన ఉద్యమాలు, స్వచ్ఛ భారత్, ఖాదీ, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌కు సంబంధించిన ప్రాజెక్టులపై కూడా చర్చించారు.

సానుకూలతను వ్యాప్తి చేయడానికి, అట్టడుగు స్థాయిలో మార్పును గుర్తించడానికి మన్ కీ బాత్ ఉత్తమ వేదిక అని ప్రధాని మోదీ అన్నారు. ఈ కార్యక్రమం ప్రజలతో కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుందని.. మన్ కీ బాత్ కేవలం ఒక కార్యక్రమం కాదని, ఇది పౌరుల మన్ కీ బాత్‌కు ప్రతిబింబమని ప్రధాని అన్నారు. ప్రజల భావాలను వ్యక్తీకరించే మాధ్యమం ఇదని అభిప్రాయపడ్డారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..