AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Narendra Modi: నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్‌ కీ బాత్‌.. కీలక అంశాలపై ప్రస్తావించే అవకాశం..

Mann Ki Baat - Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం 11గంటలకు ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల..

Narendra Modi: నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్‌ కీ బాత్‌.. కీలక అంశాలపై ప్రస్తావించే అవకాశం..
Shaik Madar Saheb
|

Updated on: Feb 28, 2021 | 9:16 AM

Share

Mann Ki Baat – Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం 11గంటలకు ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో.. ఈ రోజు మన్‌ కీ బాత్ కార్యక్రమంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత కొన్ని రోజులుగా యువత ఉపాధి సమస్యను సోషల్ మీడియాలో లేవనెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉద్యోగ, ఉపాధి రంగాలపై ప్రధాని మోదీ ఏవైనా ప్రకటన చేస్తారా.. అనే దానిపై చర్చ నడుస్తోంది. దీంతోపాటు మళ్లీ దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటం, అదేవిధంగా పలుచోట్ల లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీనిపై కూడా మోదీ మాట్లాడతారని సమాచారం. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్‌, అసోం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఆయా ప్రాంతాల్లో బీజేపీ అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో వీటన్నింటిపై ప్రధాని ప్రసంగిస్తారని పేర్కొంటున్నారు.

ఇదిలాఉంటే.. గతనెల జనవరి 31న చివరిసారి జరిగిన మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. జనవరి 26 రిపబ్లిక్ దినోత్సవం రోజున ఎర్రకోటపై జాతీయ పతాకానికి అవమానం జరగడంపై దేశం దిగ్భ్రాంతి చెందిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇలాంటి వాటిని ప్రజలు సహించరంటూ పేర్కొన్నారు. అంతేకాకుండా చాలా విషయాలను ప్రధాని మోదీ పంచుకున్నారు. హైదరాబాద్‌లోని బోయినపల్లిలోని స్థానిక కూరగాయాల మార్కెట్‌లో కుళ్లిపోయిన కూరగాయల నుంచి 500 యూనిట్ల విద్యుత్‌ తయారీ, హర్యానాలోని పంచకుల బారౌట్ పంచాయతీలోని మురికి నీటిని శుద్ధి చేస్తున్న తీరు, అరుణాచల్ ప్రదేశ్ మోన్ షుగు కాగితం తయారీ తదితర స్ఫూర్తివంతమైన కథనాలపై ప్రసంగించారు.

గతేడాది చివరి ఎపిసోడ్‌లో భారతదేశం తయారు చేసిన ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా డిమాండ్‌ పెరుగుతోందని, వాటిని అందరూ ఆదరించాలని కోరారు. ‘లోకల్‌ ఫర్‌ వోకల్‌’ నినాదానికి మద్దతు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. స్వదేశీ ఉత్పత్తులను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీసుకురావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.

Also Read:

PM Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అంతర్జాతీయ నాయకత్వ పురస్కారం..

ఫేస్‌‘బుక్‌’.. సోషల్ మీడియా సంస్థకు అమెరికా షాక్.. 650 మిలియన్ డాలర్ల జరిమానా..

గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!
భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్..