PM Modi: పద్మ గ్రహీతలు తులసి గౌడ, సుక్రి బొమ్మగౌడల ఆశీర్వాదం తీసుకున్న ప్రధాని మోడీ .. హృదయాన్ని హత్తుకునే వీడియో వైరల్

ప్రధాని మోడీ అంకోలాలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలు తులసి గౌడ, సుక్రి బొమ్మగౌడలను కలిశారు. ఈ సమావేశంలో చోటు చేసుకున్న ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ తీరుపై సర్వత్రా చర్చ జరుగుతోంది

PM Modi: పద్మ గ్రహీతలు తులసి గౌడ, సుక్రి బొమ్మగౌడల ఆశీర్వాదం తీసుకున్న ప్రధాని మోడీ .. హృదయాన్ని హత్తుకునే వీడియో వైరల్
Pm Modi Video Viral
Follow us
Surya Kala

|

Updated on: May 04, 2023 | 10:13 AM

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ అంకోలాలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలు తులసి గౌడ, సుక్రి బొమ్మగౌడలను కలిశారు. ఈ సమావేశంలో చోటు చేసుకున్న ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ తీరుపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

అంకోలా వేదికపై ప్రధాని నరేంద్ర మోడీ పద్మ అవార్డు గ్రహీతలతో సంభాషించారు. ఈ సందర్భంగా ఆప్యాయంగా కరచాలనం చేసి శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో, తులసి గౌడ ప్రధాని మోడీ పాదాలను తాకడానికి ప్రయత్నించినప్పుడు.. ప్రధాని మోడీ తులసి గౌడను ఆపారు. అంతేకాదు ఇద్దరు మహిళలకు ప్రధాని మోడీ నమస్కరించి.. ఆశీర్వాదం కోరారు.

ఇవి కూడా చదవండి

ఇదే విషయంపై తులసి గౌడ స్పందిస్తూ..  ప్రధాని మోడీని కలిసిన అనంతరం పద్మ అవార్డు గ్రహీత తులసి గౌడ మాట్లాడుతూ.. అంకోలా ప్రజలను కలిసేందుకు ఢిల్లీ నుంచి ప్రధాని రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. అంతేకాదు ప్రధాని మోడీ తన ఆశీర్వాదం తీసుకున్నారని చెప్పారు. గతంలో ఢిల్లీలో కూడా ఆయన్ను కలిశానని తులసి గౌడ చెప్పారు. ప్రధాని మోడీని కలిసిన అనంతరం తాము చాలా సంతోషంగా ఉన్నామని చెప్పారు.

పద్మశ్రీతో సత్కరించారు కర్నాటకకు చెందిన గిరిజన మహిళ తులసి గౌడ పర్యావరణ పరిరక్షణకు చేసిన కృషికి గాను 2021లో పద్మశ్రీ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. సుక్రి బొమ్మగౌడను “హల్కీ కి కోకిల” అని పిలుస్తారు. జానపద గాయని సుక్రికు 2017లో పద్మశ్రీ అవార్డు లభించింది.

కర్ణాటక పర్యటనలో ప్రధాని మోడీ బిజిబిజీ  ఉత్తర కన్నడ జిల్లా అంకోలాలో జరిగిన ర్యాలీలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం వచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయ ప్రత్యర్ధులు అందరూ కలిసి తనను టార్గెట్ చేస్తున్నారని.. దీని కోసం దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారని ప్రధాని అన్నారు. కర్ణాటకలో మళ్ళీ బీజేపీని గెలిపించాలని ప్రజలకు ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..