PM Modi 5G Services: భారత్‌లో 5జీ సేవలు.. లాంఛనంగా ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా 5జీ ఇంటర్నెట్ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. దీంతోపాటు ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) ఆరో ఎడిషన్‌ను ప్రారంభించారు.

PM Modi 5G Services: భారత్‌లో 5జీ సేవలు.. లాంఛనంగా ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ..
Pm Modi
Follow us

|

Updated on: Oct 01, 2022 | 10:47 AM

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా 5జీ ఇంటర్నెట్ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. దేశ రాజధాని ప్రగతి మైదాన్‌లో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (IMC) ఆరో ఎడిషన్‌ను ముందుగా ప్రధాని మోడీ ప్రారంభిచారు. అనంతరం 5జీ సేవలను ప్రారంభించారు. తొలి విడతలో దేశంలోని 13 నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (IMC) ఆరవ ఎడిషన్‌ను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ ప్రగతి మైదాన్‌లో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులను పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. రిలయన్స్ జియో ఛైర్మన్, ఆకాష్ అంబానీ త్వరలో దేశవ్యాప్తంగా ప్రారంభించబోతున్న 5G సేవల గురించి ప్రధాని మోడీకి వివరించారు. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్, తదితర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా.. రెండేళ్లలో దేశవ్యాప్తంగా 5జీ సేవలను విస్తరించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. దశల వారీగా 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది.

ఈ సందర్భంగా జియో పెవిలియన్‌ను ప్రధాని మోడీ సందర్శించి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. యువ జియో ఇంజనీర్ల బృందం ఎండ్-టు-ఎండ్ 5G సాంకేతికత, స్వదేశీ అభివృద్ధి పరికరాలగురించి వివరించారు. పట్టణ – గ్రామీణ ఆరోగ్య సంరక్షణ డెలివరీ మధ్య అంతరాన్ని తగ్గించడంలో 5G ఎలా సహాయపడుతుందో చెప్పారు. ఈ కార్యక్రమంలో టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్, టెలికాం శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ చౌహాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, ఆర్‌జేఐఎల్ చైర్మన్ ఆకాష్ అంబానీ తదితరులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

5G సేవలతో హై స్పీడ్ ఇంటర్నెట్ డేటా అందుబాటులోకి రానుంది. ఇది కేవలం ఇంటర్నెట్ స్పీడ్‌కే పరిమితం కాకుండా, ఇది ఆటోమేషన్‌ను కొత్త దశకు తీసుకువెళుతుంది. భారతీయ టెలికాం పరిశ్రమకు చెందిన రెండు పెద్ద దిగ్గజాలు ఈ ఏడాది తమ 5జీ సేవలను ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రకటించాయి. ఈ సాంకేతికత ప్రధానంగా రెండు మోడ్‌లపై ఆధారపడి ఉంటుంది. అవి ఇండిపెండెంట్ అండ్ నాన్-స్టాండలోన్ గా ఉంటాయి. విశేషమేమిటంటే 5G నెట్‌వర్క్‌ డేటా వేగం 4G కంటే చాలా రెట్లు ఎక్కువ వేగాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ఎలాంటి అంతరాయం లేకుండా మెరుగైన కనెక్టివిటీని కలిగి ఉంటుంది.

డేటాను పంచుకునేందుకు వీలుగా బిలియన్ల కొద్దీ కనెక్ట్ చేసిన పరికరాలను దీనికి అనుసంధానించనున్నాయి. ఈ మొదటి దశ సేవలు అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్, జామ్‌నగర్, కోల్‌కతా, లక్నో, ముంబై, పూణే నగరాలు ఉన్నాయి.