క్రొయేషియాలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం.. ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు!
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మూడు దేశాల పర్యటన చివరి దశలో భాగంగా బుధవారం(జూన్ 18) క్రొయేషియా చేరుకున్నారు. కెనడాలో జరిగిన G7 సమావేశంలో పాల్గొన్న తర్వాత ప్రధాని మోదీ క్రొయేషియా చేరుకున్నారు. అధికారిక పర్యటనలో క్రొయేషియా చేరుకున్న తొలి భారతీయ ప్రధాని మోదీ. ఆయన పర్యటన ద్వైపాక్షిక సంబంధాలకు ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మూడు దేశాల పర్యటన చివరి దశలో భాగంగా బుధవారం(జూన్ 18) క్రొయేషియా చేరుకున్నారు. కెనడాలో జరిగిన G7 సమావేశంలో పాల్గొన్న తర్వాత ప్రధాని మోదీ క్రొయేషియా చేరుకున్నారు. అధికారిక పర్యటనలో క్రొయేషియా చేరుకున్న తొలి భారతీయ ప్రధాని మోదీ. ఆయన పర్యటన ద్వైపాక్షిక సంబంధాలకు ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు. క్రొయేషియా రాజధాని జాగ్రెబ్‌లో అడుగు పెట్టిన ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం లభించింది.
#WATCH | Prime Minister Narendra Modi arrives in Zagreb, Croatia, the last leg of his three-nation tour, after concluding his visit to Canada's Kananaskis, where he attended the 51st G7 Summit.
(Source: ANI/DD) pic.twitter.com/tBqmfNLrb1
— ANI (@ANI) June 18, 2025
కెనడాలో జీ-7 సదస్సుకు హాజరైన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రొయేషియా చేరుకున్నారు. క్రొయేషియా అధ్యక్షుడు జోరాన్ మిలానోవిక్, ప్రధాని ఆండ్రేజ్ ప్లెంకోవిక్‌లతో మోదీ ద్వైపాక్షిక భేటీలు నిర్వహించారు. విద్య, ఐటీ, స్టార్టప్‌లు, పునరుత్పాదక శక్తి, సైన్స్ అండ్ టెక్నాలజీ, సంస్కృతి వంటి రంగాల్లో సహకార ఒప్పందాలపై చర్చలు జరిగాయి. అక్కడి విశ్వవిద్యాలయాల్లో హిందీ బోధనకు మద్దతు లాంటి అంశాలపై కూడా చర్చించారు. భారతీయ వ్యాపారవేత్తలతో సమావేశమై వాణిజ్య, పెట్టుబడి అవకాశాలపై ప్రధాని మోదీ చర్చించారు.
క్రొయేషియాతో భారతదేశం అనేక శతాబ్దాలుగా సంబంధాలు కొనసాగిస్తోంది. జాగ్రెబ్ విశ్వవిద్యాలయంలోని ఇండాలజీ విభాగం గత 60 సంవత్సరాలుగా పనిచేస్తోంది. ఈ యూరోపియన్ దేశంలో యోగా, ఆయుర్వేదంపై కూడా విస్తృత ఆసక్తి ఉంది. గత మూడు సంవత్సరాలలో క్రొయేషియాలోని భారతీయ సమాజం వేగంగా మారిపోయింది. డిసెంబర్ 2024 నాటికి, క్రొయేషియాలో దాదాపు 17,000 మంది భారతీయులు ఉన్నారు. చాలా మంది భారతీయ కార్మికులు స్వల్ప నుండి మధ్యస్థ కాల ఒప్పందాలపై పని చేయడానికి ఇక్కడికి వస్తారు. ప్రస్తుతం ఇక్కడ నివసిస్తున్న వారిలో కనీసం 90 శాతం మంది క్రొయేషియాలో నిర్ణీత కాలం పాటు నివసిస్తున్న జనాభాలో భాగం.
ఇదిలావుంటే, ఈ పర్యటనకు ముందు ప్రధాని మోదీ జూన్ 15న సైప్రస్‌కు వెళ్లారు. అక్కడ ‘ఇండియా-మిడిలీ ఈస్ట్-యూరప్ కారిడార్ ప్రాజెక్టులో భాగస్వామ్యంపై చర్చించారు. మారిటైం, రక్షణ, సైబర్ భద్రత రంగాల్లో ద్వైపాక్షిక ఒప్పందాలు చేయడం జరిగింది. జూన్ 16న కెనడాలో జీ7 సమ్మిట్‌లో పాల్గొని, గ్లోబల్ సౌత్, వాణిజ్యం, పర్యావరణం, శాంతి అంశాలపై ప్రపంచ నేతలతో చర్చించారు. ఈ మూడు దేశాల పర్యటన ద్వారా భారతదేశం తన అంతర్జాతీయ సంబంధాలను మరింత బలోపేతం చేయడమే కాక, వ్యూహాత్మక భాగస్వామ్యాలను విస్తరించేందుకు అడుగులు వేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
