Vande bharat express: పట్టాలెక్కనున్న మరో వందే భారత్ రైలు.. ఆ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం 5 గంటలే
దేశంలో వందే భారత్ రైళ్ల సర్వీసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అత్యాధునిక, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తూ అందుబాటులోకి వచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు ఆదరణ లభిస్తోన్న తరుణంలో.. ఇండియన్ రైల్వే సర్వీసుల సంఖ్యను పెంచుతోంది. ఈ క్రమంలోనే తాజాగా భారత్‌లో...

దేశంలో వందే భారత్ రైళ్ల సర్వీసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అత్యాధునిక, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తూ అందుబాటులోకి వచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు ఆదరణ లభిస్తోన్న తరుణంలో.. ఇండియన్ రైల్వే సర్వీసుల సంఖ్యను పెంచుతోంది. ఈ క్రమంలోనే తాజాగా భారత్‌లో మరో వందే భారత్ రైల్వే సేవలు ప్రారంభంకానున్నాయి. రాజస్థాన్ రాష్ట్రంలో తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఏప్రిల్ 12వ తేదీన అందుబాటులోకి రానుంది. వర్చువల్ విధానంలో ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు.
ఈ వందే భారత్ రైలు అజ్మీర్-ఢిల్లీకాంట్‌ల మధ్య నడవనుంది. రెగ్యులర్ సర్వీస్‌లు ఏప్రిల్ 13వ తేదీ నుంచి మొదలుకానున్నాయి. జైపూర్, అల్వార్, గుర్గాన్ స్టేషన్స్‌లో ఈ రైలు ఆగుతుంది. ప్రస్తుతం ఈ రెండు స్టేషన్స్ మధ్య అందుబాటులో ఉన్న రైలు ప్రయాణానికి 6 గంటల 15 నిమిషాలు సమయం పడుతుంది. అయితే కొత్తగా అందుబాటులోకి వస్తున్న వందే భారత్‌తో 5 గంటల్లోనే గమ్యాన్ని చేరుకోవచ్చు. గంట సమయం మిగలనుంది.
రాజస్థాన్, ఢిల్లీల మధ్య నడిచే ఈ రైలు రాజస్థాన్‌లోని పుష్కర్, అజ్మీర్ షరీఫ్ దర్గా వంటి పర్యాటక ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ అందించనుంది. ఈ మార్గాల్లో సామాజిక, ఆర్థికాభివృద్ధికి కూడా ప్రోత్నాహాన్ని ఇవ్వనుంది. పూర్తిగా 100 శాతం స్వదేశీ సాంకేతికతో తయారు చేసిన వందే భారత్‌లో ఆటోమెటిక్ డోర్లు, జీపీఎస్ సిస్టమ్, వైఫై వంటి ఎన్నో అధునాతన ఫీచర్లు ఉన్నాయి.




మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..