Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ఊబకాయంపై యుద్ధం.. ‘ఫిట్ ఇండియా’ నినాదం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

దేశంలో ఊబకాయంతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. ఉత్తరాఖండ్‌లో పర్యటించిన ఆయన.. దేశంలో ఊబకాయం సమస్య వేగంగా పెరుగుతోందని.. నమోదైన గణాంకాలే చెబుతున్నాయని చెప్పారు. ఫిట్‌నెస్‌పై ప్రతీ ఒక్కరూ దృష్టిసారించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆ వివరాలు ఇలా..

PM Modi: ఊబకాయంపై యుద్ధం.. 'ఫిట్ ఇండియా' నినాదం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Pm Modi
Follow us
Ravi Kiran

| Edited By: Ram Naramaneni

Updated on: Jan 30, 2025 | 4:59 PM

దేశంలో ఊబకాయంతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. ఉత్తరాఖండ్‌లో పర్యటించిన ఆయన.. దేశంలో ఊబకాయం సమస్య వేగంగా పెరుగుతోందని.. నమోదైన గణాంకాలే చెబుతున్నాయని చెప్పారు. ఫిట్‌నెస్‌పై ప్రతీ ఒక్కరూ దృష్టిసారించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఊబకాయంతో మధుమేహం, గుండె జబ్బులు వంటి వ్యాధుల ప్రమాదం పొంచి ఉందన్నారు. ‘ఫిట్ ఇండియా’ ఉద్యమం ద్వారా దేశంలోని నేటి యువత ఫిట్‌నెస్, ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి అవగాహన పెంపొందించుకుంటున్నారని.. అది తనను ఎంతగానో సంతృప్తినిస్తోందని ప్రధానమంత్రి తెలిపారు.

శారీరక శ్రమ, క్రమశిక్షణ, సమతుల్య జీవితం అనేవి మనిషి జీవితంలో ఎంత ముఖ్యమైనవో.. ఈ జాతీయ క్రీడలు మనకు నేర్పిస్తాయన్నారు. సరైన వ్యాయామం, పౌష్టికాహారంపై దేశ ప్రజలు కచ్చితంగా దృష్టిపెట్టాలి. ప్రతిరోజూ కొంత సమయం వ్యాయామం కోసం కేటాయించాలి. అలాగే సమతుల్యమైన పౌష్టికాహారం తీసుకోవడం కూడా ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. అలాగే మనం తీసుకునే ఆహరంలో చెడు కొలెస్ట్రాల్, నూనె కంటెంట్ తక్కువ ఉండేలా చూసుకోవాలని ప్రధాని అన్నారు. ప్రతీ నెలా రెండు లీటర్ల వంట నూనెను వాడుతున్నట్లయితే.. అందులో 10 శాతం మేరకు తగ్గించండి.. తద్వారా ఊబకాయాన్ని నివారించే మార్గాన్ని మీరే కనుగొనవచ్చు. ఇలాంటి చిన్నా చితకా హోం రెమిడీస్ ద్వారా మీ శరీరంలో పెద్ద మార్పును తీసుకురావచ్చు. ఆరోగ్యకరమైన శరీరం మాత్రమే ఆరోగ్యకరమైన మనస్సును, ఆరోగ్యకరమైన దేశాన్ని సృష్టించగలదు. రాష్ట్ర ప్రభుత్వాలు, పాఠశాలలు, కార్యాలయాలు, రాజకీయ నాయకులు దీని గురించి అవగాహన కల్పించాలి. సరైన పోషకాహారం గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. మనమందరం కలిసికట్టుగా ‘ఫిట్ ఇండియా’ని నిర్మిద్దామంటూ ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.