AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ప్రధాని మోడీ కేదార్‌నాథ్‌ ఆలయ సందర్శన.. రూ.3,400 కోట్లతో రోప్‌వే ప్రాజెక్టు నిర్మాణం

ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు..

PM Modi: ప్రధాని మోడీ కేదార్‌నాథ్‌ ఆలయ సందర్శన.. రూ.3,400 కోట్లతో రోప్‌వే ప్రాజెక్టు నిర్మాణం
Pm Modi
Subhash Goud
|

Updated on: Oct 21, 2022 | 1:00 PM

Share

ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాని మోడీ రాకతో కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలను సుమారు రెండు క్వింటాళ్ల పూలతో సుందరంగా అలంకరించారు. ఆలయం సందర్శన నేపథ్యంలో మోడీ సంప్రదాయ పహాడీ దుస్తుల్లో కనిపించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా మహిళలు తయారు చేసిన దుస్తులను ఆయన ధరించారు. అయితే ప్రధాని మోడీ కేదార్‌నాథ్‌ను సందర్శించడం ఇది ఆరోసారి.

రోప్‌వే ప్రాజెక్టుకు శంకుస్థాపన:

ఆలయ సందర్శన నేపథ్యంలో రోప్‌వే ప్రాజెక్టుకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. గౌరీ కుండ్‌ నుంచి కేదార్‌నాథ్‌, గోవింద్‌ఘట్‌ నుంచి హేమకుండ్‌ సాహిబ్‌లను కలుపుతూ రెండు కొత్త రోప్‌వే ప్రాజెక్టును అందుబాటులోకి రానున్నాయి. 3,400 కోట్లతో కేంద్ర సర్కార్‌ కొత్త రోప్‌వే ప్రాజెక్టులను చేపడుతోంది. ఇక్కడ జరుగుతున్న పలు అభివృద్ధి పనులను మోడీ పరిశీలించనున్నారు. అలాగే ఆదిగురువు శంకరాచార్యుల సమాధి స్థలాన్ని సందర్శించనున్నారు. కేదార్‌నాథ్‌లోని మందకి అస్తపథం, సరస్వతీ అస్తి పథాలను పరిశీలిస్తారు. ప్రధాన పర్యటన నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ రెం రోజుల పాటు మోడీ పర్యటన కొనసాగనుంది.

ఇవి కూడా చదవండి

Pm Modi1

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో మోడీ రెండు రోజుల పర్యటనలో భాగంగా వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల పనులను పరిశీలించనున్నారు. ఇందుకు సంబంధించి వివరాలు అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. గౌరీకుండు నుంచి కేదార్‌నాథ్‌ 9.7 కిలోమీటర్ల రోప్‌వే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నారు.

కాగా, అంతకు ముందు డెహ్రడూన్‌లోని జాలీ గ్రాంట్‌ ఎయిర్‌పోర్టుకు ఉదయం ప్రత్యేక విమానాంలో చేరుకున్నారు. మోడీ రాక సందర్భంగా ఆ రాష్ట్ర గవర్నర్‌ గుర్మిత్‌ సింగ్‌, ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి ఘన స్వాగతం పలికారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
మరోసారి పరువు తీసుకున్న హెచ్సీఏ.. కొద్దిసేపు చీకట్లో స్టేడియం..
మరోసారి పరువు తీసుకున్న హెచ్సీఏ.. కొద్దిసేపు చీకట్లో స్టేడియం..