PM Modi: వికసిత్‌ భారత్‌ లక్ష్యసాధనలో యువత కీలకం.. యువత సలహాలు స్వీకరిస్తున్నాః మోదీ

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో యువజన వ్యవహారాల శాఖ రెండు రోజుల విక్షిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్‌ను విజయవంతంగా ప్రారంభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం భారత్ మండపంలో విక్షిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025లో ప్రదర్శనను సందర్శించారు. తన పర్యటనలో, ప్రధాని మోదీ పాల్గొనే వారితో సంభాషించారు. వారి ప్రాజెక్టులను పరిశీలించారు.

PM Modi: వికసిత్‌ భారత్‌ లక్ష్యసాధనలో యువత కీలకం.. యువత సలహాలు స్వీకరిస్తున్నాః మోదీ
Pm Narendra Modi
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 12, 2025 | 4:40 PM

వికసిత్‌ భారత్‌ లక్ష్యసాధనలో దేశ యువత చాలా కీలకపాత్ర పోషిస్తున్నారని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఢిల్లీ భారత మండపంలో వికసిత్‌ భారత్‌ యంగ్‌లీడర్స్‌ డైలాగ్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. దేశ నలుమూలల నుంచి యువ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భారత ప్రతిష్టను యువత అన్ని రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో చాటుతున్నారని మోదీ ప్రశంసించారు. భారతీయుడు చంద్రుడిపై అడుగు పెట్టాలని, అంతరిక్షంలో భారత స్పేస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తునట్టు చెప్పారు.

నేషనల్‌ యూత్‌ డే సందర్భంగా స్వామి వివేకానందకు ప్రధాని మోదీ ఘననివాళి అర్పించారు. పాలసీ రూపకల్పనలో అధికారులు , మంత్రుల సలహాలతో పాటు తాను యువత సలహాలు కూడా తీసుకుంటునట్టు చెప్పారు మోదీ.. లక్షమంది యువనేతలను తయారు చేయడం తన లక్ష్యమని ఎర్రకోట సాక్షిగా తాను చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. బలమైన, అభివృద్ధి చెందిన భారతదేశం గురించి ఆయన కలను నెరవేర్చడానికి మేము కట్టుబడి ఉన్నాము” అనిప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..