PM Modi: శత్రుదేశాలకు ప్రధాని మోదీ పవర్‌ఫుల్ మెసేజ్.. ఒకే రోజు రెండు చర్యలతో..

వివరాల్లోకి వెళితే.. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. మహాత్మాగాంధీకి స్మారకంగా విలసిల్లుతున్న ఈ ఆశ్రమాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం పునఃనిర్మాణం చేపట్టింది. సబర్మతి మహాత్మాగాంధీ ఆశ్రమంలో తిరిగి అభివృద్ధి చేసిన కొచ్రాబ్ ఆశ్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు...

PM Modi: శత్రుదేశాలకు ప్రధాని మోదీ పవర్‌ఫుల్ మెసేజ్.. ఒకే రోజు రెండు చర్యలతో..
Pm Modi
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 12, 2024 | 6:36 PM

ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం శత్రుదేశాలకు ఒక పవర్‌ఫుల్ సందేశాన్ని ఇచ్చారు. భారతదేశం శాంతికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, దేశ రక్షణ విషయంలో అంతే కఠినంగా ఉంటుందన్న సందేశాన్ని ఇచ్చారు. ఒకే రోజు రెండు చర్యలతో ఈ విషయాన్ని ప్రపంచానికి చెప్పకనే చెప్పారు మోదీ. ఉదయం సబర్మతి ఆశ్రం, సాయంత్రం పొఖ్రాన్‌లో భారత శక్తి కార్యక్రమంలో పాల్గొన్న మోదీ ఒక సందేశాన్ని ఇచ్చారు.

వివరాల్లోకి వెళితే.. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. మహాత్మాగాంధీకి స్మారకంగా విలసిల్లుతున్న ఈ ఆశ్రమాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం పునఃనిర్మాణం చేపట్టింది. సబర్మతి మహాత్మాగాంధీ ఆశ్రమంలో తిరిగి అభివృద్ధి చేసిన కొచ్రాబ్ ఆశ్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీ ఆశ్రమ స్మారకం మాస్టర్ ప్లాన్‌ను ఆయన ప్రారంభించారు.

బాపు సబర్మతి ఆశ్రమం దేశానికే కాదు మానవాళికి కూడా చారిత్రక వారసత్వం అని ప్రధాని మోదీ అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. మన వారసత్వాన్ని కాపాడుకోవడం మన బాధ్యత అన్నారు. వారసత్వాన్ని గౌరవించని దేశం తన భవిష్యత్తును కూడా కోల్పోతుందన్నారు. గత ప్రభుత్వాలు దీనిపై ఉదాసీనత ప్రదర్శించాయని, గత ప్రభుత్వాల హయాంలో బాపు ఆశ్రమానికి న్యాయం జరగలేదని విమర్శించారు.

ఇదిలా ఉంటే ఉదయం ఆశ్రమాన్ని సందర్శించిన ప్రధాని సాయంత్రం రాజస్థాన్‌లో పొఖ్రాన్‌లో భారత్‌ శక్తి కార్యక్రమానికి హాజరయ్యారు. భారత సైనిక శక్తిని ఈ కార్యక్రమంలో స్వయంగా వీక్షించారు. వార్‌ డ్రిల్‌ అందరిని ఆకట్టుకుంది. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు రక్షణశాఖకు పట్టించుకోలేదన్నారు మోదీ. గత పదేళ్ల నుంచి ఆత్మనిర్భర్‌ భారత్‌కు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు.

రక్షణరంగంలో భారత్‌ దూసుకెళ్తుందన్నారు మోదీ. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా డిఫెన్స్‌ రంగంలో స్వదేశం లోనే ఎక్కువ ఉత్పతులు జరుగుతున్నాయని అన్నారు మోదీ. భారత్‌ శక్తి కార్యక్రమానికి 30 దేశాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. భారత్‌ లోనే యుద్దట్యాంకులు , గన్స్‌ , యుద్దనౌకలు , క్షిపణులు తయారవుతున్నాయని అన్నారు మోదీ. ఇలా ప్రధాని నరేంద్ర మోదీ ఒకే రోజు రెండు విభిన్న ప్రదేశాలను సందర్శించి, పవర్‌ఫుల్ మెసేజ్‌ ఇచ్చారన్నమాట.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..