AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ratan Tata: దిగ్గజ వ్యాపారవేత్త రతన్‌టాటా మృతిపట్ల ప్రముఖుల సంతాపం.. నెట్టింట వైరల్ అవుతున్న ట్వీట్లు

ప్రముఖ పారిశ్రామిక వేత్త, గొప్ప మానవతావాది రతన్ టాటా మరణం పట్ల దేశ వ్యాప్తంగా పలువురు రాజకీయ, క్రీడా, వ్యాపార, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈరోజు దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందన్నారు..

Ratan Tata: దిగ్గజ వ్యాపారవేత్త రతన్‌టాటా మృతిపట్ల ప్రముఖుల సంతాపం.. నెట్టింట వైరల్ అవుతున్న ట్వీట్లు
Ratan Tata
Srilakshmi C
|

Updated on: Oct 10, 2024 | 7:00 AM

Share

ముంబై, అక్టోబర్ 10: ప్రముఖ పారిశ్రామిక వేత్త, గొప్ప మానవతావాది రతన్ టాటా మరణం పట్ల దేశ వ్యాప్తంగా పలువురు రాజకీయ, క్రీడా, వ్యాపార, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈరోజు దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందన్నారు. వారి నిష్క్రమణ పారిశ్రామిక రంగానికే కాకుండా యావత్ దేశానికి తీరని లోటని అన్నారు. రతన్ టాటా వ్యాపార రంగంలో నిబద్ధతకు, విలువలకు కట్టుబడిన గొప్ప వ్యక్తిగానే కాకుండా దాతృత్వానికి ప్రతీక అన్నారు. టాటా చారిటబుల్ ట్రస్టు ద్వారా ఆయన ఎనలేని సేవలు అందించారని, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. రతన్ టాటా ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరోవైపు రతన్ టాటా మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం సంతాపం వ్యక్తం చేశారు. రతన్ టాటా వంటి వారి దార్శనికత, చిత్తశుద్ధితో ఈ ప్రపంచంపై చిరస్థాయిగా ముద్ర వేసిన వారు చాలా అరుదని అన్నారు. ఈ రోజు మనం కేవలం ఒక వ్యాపార టైటాన్‌నే కాదు, నిజమైన మానవతావాదిని కోల్పోయామని సీఎం చంద్రబాబు అన్నారు.

భారతదేశ ఆర్థిక వృద్ధికి రతన్ టాటా చేసిన విశేష కృషిని తెలుపుతూ, ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తన ఎక్స్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారు. ‘రతన్ టాటా లేకపోవడాన్ని నేను అంగీకరించలేకపోతున్నాన’ని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా టాటా మృతిపట్ల నివాళులర్పించారు. ‘రతన్ టాటా జీ ఓ దూరదృష్టి గల వ్యాపార నాయకుడు. దయగల వ్యక్తి. అసాధారణమైన మనిషి. దేశం తొలినాళ్లలో స్థాపించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యాపార సంస్థలకు స్థిరమైన నాయకత్వాన్ని అందించారు. ఆయన వినయం, దయ సమాజాన్ని మెరుగుపర్చడానికి అచంచలమైన నిబద్ధతతో పనిచేశారు. ఎంతో మందికిస్పూర్తిగా నిలిచారు’ అని ట్వీట్‌ చేశారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా రతన్ టాటా మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ‘లెజెండరీ పారిశ్రామికవేత్త, నిజమైన జాతీయవాదిగా’ టాటాను అభివర్ణించారు. రతన్ టాటా మృతి టాటా గ్రూప్‌కే కాదు, ప్రతి భారతీయుడికీ తీరని లోటు అని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ట్వీట్‌ చేశారు. తన ప్రియమైన స్నేహితుడిని కోల్పోయానని భావోధ్వేగానికి గురయ్యారు. మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్‌లో.. లక్షలాది మంది మనోభావాలను ప్రతిధ్వనిస్తూ, టాటాను జాతీయ సంపదగా అభివర్ణించాడు.

అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ కూడా రతన్ టాటా మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. దేశాభివృద్ధిపై ఆయన తీవ్ర ప్రభావాన్ని చూపారన్నారు. ‘దేశం ఒక దిగ్గజాన్ని కోల్పోయింది. ఆధునిక భారతదేశ మార్గాన్ని పునర్నిర్వచించిన ఒక దార్శనికుడు. రతన్ టాటా కేవలం వ్యాపార నాయకుడు మాత్రమే కాదు.. ఆయన సమగ్రత, కరుణ, తిరుగలేని నిబద్ధతతో దేశ స్ఫూర్తిని మూర్తీభవించారు. ఆయనలాంటి లెజెండ్‌లు ఎప్పటికీ మన మనసుల్లో నిలిచి ఉంటారని ట్వీట్‌ చేశారు. ఇక కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ ఉదయ్ కోటక్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, బాలీవుడ్‌ నటుడు అజయ్ దేవగన్, నటుడు రితేష్ దేశ్‌ముఖ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, గూగుల్, ఆల్ఫాబెట్ CEO అయిన సుందర్ పిచాయ్, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఇలా ఎందరో ప్రముఖులు టాటా మృతి పట్ల సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.