AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ratan Tata: ‘4 సార్లు లవ్‌ ఫెయిల్‌..’ రతన్‌ టాటా ఆజన్మ బ్రహ్మచారిగా మిగిలిపోవడానికి ఆమె కారణం..

దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా (86) మరణ వార్త యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. గత కొన్ని రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం అర్ధరాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. రతన్ టాటా మరణం పట్ల పలువురు ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా..

Ratan Tata: '4 సార్లు లవ్‌ ఫెయిల్‌..' రతన్‌ టాటా ఆజన్మ బ్రహ్మచారిగా మిగిలిపోవడానికి ఆమె కారణం..
Ratan Tata
Srilakshmi C
|

Updated on: Oct 10, 2024 | 6:25 AM

Share

ముంబై, అక్టోబర్‌ 10: దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా (86) మరణ వార్త యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. గత కొన్ని రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం అర్ధరాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. రతన్ టాటా మరణం పట్ల పలువురు ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే బాధ్యతలు స్వీకరించిన రతన్ టాటా.. తన అత్యున్నత మేథో సంపదతో టాటా గ్రూప్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు. అయితే రతన్ టాటా ఆ జన్మాంతం బ్రహ్మచారిగానే మిగిలిపోయారు. అసలు ఆయన పెళ్లి ఎందుకు చేసుకోలేదు? అనే విషయం చాలా మందికి తెలియదు.

నాలుగు సార్లు లవ్‌ ఫెయిల్‌

అవును.. టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటాకు వివాహం కాలేదు. అయితే ఆయన నాలుగు సార్లు లవ్‌ ఫెయిల్‌ అయినట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. రతన్ టాటా తన ప్రేమ జీవితం గురించి మాట్లాడుతూ.. తన జీవితంలో ఒక్కసారి కాదు నాలుగు సార్లు ప్రేమ తలుపు తట్టిందని, అయితే క్లిష్ట పరిస్థితుల కారణంగా తమ బంధం పెళ్లి వరకు రాలేదని చెప్పాడు. దీని తర్వాత ఆయన మళ్లీ పెళ్లి గురించి ఆలోచించలేదట. తన జీవితం మొత్తం దేశంలో టాటా గ్రూప్ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడంపై పూర్తిగా దృష్టి పెట్టినట్లు వివరించారు.

‘అందుకే పెళ్లి గురించి ఆలోచించలేదు’

రతన్ టాటా 1937 డిసెంబర్ 28న సూరత్‌లో జన్మించారు. వ్యక్తిత్వంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించారు. టాటా గ్రూప్‌ ఆఫ్‌ బిజినెస్‌లను సక్సెస్‌ఫుల్‌గా నడిపించాడు. అందుకే టాటా నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. కానీ వ్యాపారంలో విజయవంతమైన పారిశ్రామికవేత్తలలో ఒకరుగా పేరు తెచ్చుకున్న రతన్ టాటా ప్రేమలో విఫలమయ్యారు. తన ప్రేమలు విఫలం అవ్వడానికి గల కారణాలను ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. తాము ప్రేమలో ఉన్నా, వివాహం చేసుకోకూడదనే నిర్ణయం నాకు సరైనదిగా అనిపించింది. ఆమె నా జీవితంలో ఉంటే పరిస్థితి మరింత క్లిష్టంగా ఉండేదని చెప్పాడు. ‘మీరెప్పుడైనా నాకు క్రష్ ఉందా అని ప్రశ్నిస్తే.. నేను పెళ్లి గురించి నాలుగు సార్లు సీరియస్‌గా ఆలోచించానని చెబుతాను. అయితే ప్రతిసారీ ఏదో ఒక రకమైన భయంతో నేను వెనక్కి తగ్గానని కూడా చెబుతాను. తన ప్రేమ రోజుల గురించి టాటా మాట్లాడుతూ.. ‘నేను అమెరికాలో పని చేస్తున్నప్పుడు, నా ప్రేమ గురించి చాలా తీవ్రంగా ఉండేవాడిని. ఇండియాకితిరిగి వచ్చిన తర్వాత మేము వివాహం చేసుకోలేకపోయాం’ అని చెప్పారు.

ఇవి కూడా చదవండి

రతన్ టాటా జిజీని ప్రేమించాడు. కానీ ఆమె ఇండియాకి రావడానికి ఇష్టపడలేదు. అదే సమయంలో ఇండో-చైనా యుద్ధం కూడా మొదలైంది. చివరకు ఆమె అమెరికాలో మరొకరిని పెళ్లాడింది. దీని తర్వాత రతన్‌ టాటా తన పూర్తి దృష్టిని టాటా గ్రూపుపై కేంద్రీకరించాడు. గ్రూప్ కంపెనీలను ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేశాడు. ఇంటి వంటగదిలో ఉపయోగించే ఉప్పు నుంచి ఆకాశంలో విమాన ప్రయాణం వరకు టాటా గ్రూప్ కంపెనీలు తమ ప్రత్యేక ఉనికిని చాటుకున్నాయి. పెళ్లి చేసుకోనప్పటికీ.. రతన్ టాటా చాలా సంతోషకరమైన జీవితాన్ని గడిపారు. అతను తన అభిరుచిలను పూర్తిగా ఫాలో అయ్యేవారు. ఇందులో కార్ల నుంచి పియానో వాయించడం వరకు అన్నీ ఉన్నాయి. ఈ జాబితాలో ఫ్లైయింగ్ కూడా ఉంది. టాటా సన్స్ నుంచి 2012లో 75 యేళ్ల వయసులో రిటైర్‌మెంట్‌ తీసుకున్న తర్వాత తన మిగిలిన జీవితం తన అభిరుచి (passion)లను కొనసాగించాలనుకుంటున్నట్లు ఓ సందర్భంలో చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.