AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India-Pakistan: యుద్ధం ఆగింది సరే.. నెక్స్ట్ ఏంటి..? ప్రధాని మోదీ కీలక సమావేశం..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మధ్యవర్తిత్వం వహించడం.. ఈ క్రమంలోనే పాక్ నుంచి భారత్ కు ఫోన్ రావడం.. చర్చలు అంటూ మాట్లాడటం.. చకాచకా జరిగిపోయాయి.. దీంతో పాకిస్తాన్ కాళ్లబేరానికి రావడంతో.. భారత్ కూడా కాల్పుల విరమణకు ఒప్పుకుంది. సాయంత్రం 5 గంటల నుంచి రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది.

India-Pakistan: యుద్ధం ఆగింది సరే.. నెక్స్ట్ ఏంటి..? ప్రధాని మోదీ కీలక సమావేశం..
India Pakistan
Shaik Madar Saheb
|

Updated on: May 10, 2025 | 8:10 PM

Share

పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం.. భారత్ పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో.. ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది.. అలాగే కీలక ఉగ్రవాదులను మట్టుబెట్టింది.. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తలు పెరిగాయి.. అదిగో యుద్ధం.. ఇదిగో యుద్ధం.. పాక్‌ సేనలు ఎల్‌వోసీ వైపు కదిలాయి. పాక్‌కు బుద్ధి చెప్పేందుకు భారత సేనలు కూడా రెడీ అయ్యాయి. ఇంతలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మధ్యవర్తిత్వం వహించడం.. ఈ క్రమంలోనే పాక్ నుంచి భారత్ కు ఫోన్ రావడం.. చర్చలు అంటూ మాట్లాడటం.. చకాచకా జరిగిపోయాయి.. దీంతో పాకిస్తాన్ కాళ్లబేరానికి రావడంతో.. భారత్ కూడా కాల్పుల విరమణకు ఒప్పుకుంది. సాయంత్రం 5 గంటల నుంచి రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. ఈనెల 12న భారత్‌-పాకిస్తాన్ మధ్య చర్చలు జరగనున్నాయి. యుద్ధం ఆగింది ఓకే.. కానీ భారత్‌-పాక్‌ మధ్య మూడోదేశం జోక్యం చేసుకోవద్దన్న సిమ్లా ఒప్పందం ఏమైంది? పాకిస్తాన్ పై భారత్ విధించిన ఆంక్షలు కొనసాగుతాయా..? చర్చలు ఎలా ఉండనున్నాయ్ అనేది ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో పాక్‌తో కొనసాగించాల్సిన వైఖరిపై భారత్ కీలక సమావేశాలు నిర్వహించనుంది.

కాల్పుల విరమణ అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ EAM డాక్టర్ ఎస్ జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, NSA అజిత్ దోవల్, CDS, త్రివిధ దళాల అధిపతులతో  సమావేశమయ్యారు. ప్రస్తుత పరిణామాలను దోవల్ ప్రధానికి వివరించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత.. కాల్పుల విరమణ.. నిబంధనల ప్రకారం మాత్రమే కొనసాగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ NSA దోవల్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇద్దరికీ స్పష్టం చేసినట్లు వర్గాలు తెలిపాయి.

ఎల్లుండి నుంచి ఇరు దేశాల మధ్య చర్చలు.. కొనసాగనున్న నేపథ్యంలో చర్చల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రేపు మరిన్ని కీలక భేటీలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది..

అయితే.. ఈనెల 12న జరిగే ఇరుదేశాల భేటీలో పాక్‌పై ఆంక్షల పై భారత్ నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది… కేవలం సైనిక చర్యలు,కాల్పుల విరమణకు మాత్రమే భారత్‌ అంగీకారం తెలిపింది. సింధు జలాల ఒప్పందం నిలిపివేతపై అదే వైఖరి కొనసాగించనుంది.. వీసాల రద్దు,దౌత్య పరమైన అంశాలపై కూడా ఆంక్షలు కొనసాగనున్నాయి. పాక్‌తో కొనసాగనున్న వాణిజ్యపరమైన ఆంక్షలు, ఎయిర్ స్పేస్ మూసివేత ఇవన్నీ యథావిధిగా కొనసాగనున్నాయి..

ఉగ్రవాదం పై పాక్ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేయనున్న భారత్.. ఆ దిశగా చర్చలను జరపనుంది. అప్పటివరకు పాక్ పై భారత దౌత్య, ఆర్థిక, జల యుద్ధం కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం