PM Kisan Grant: ఆ రాష్ట్రంలో అర్హత లేని 3 లక్షల మందికి పీఎం కిసాన్‌ డబ్బులు మంజూరు.. రూ.200 కోట్ల రికవరీకి కేంద్రం ఆదేశాలు

PM Kisan Grant: రైతులకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు, వ్యవసాయం ఖర్చులో తోడుగా ఉండేందుకు..

PM Kisan Grant: ఆ రాష్ట్రంలో అర్హత లేని 3 లక్షల మందికి పీఎం కిసాన్‌ డబ్బులు మంజూరు.. రూ.200 కోట్ల రికవరీకి కేంద్రం ఆదేశాలు
PM Kisan Yojana
Follow us
Subhash Goud

|

Updated on: May 13, 2022 | 8:57 AM

PM Kisan Grant: రైతులకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు, వ్యవసాయం ఖర్చులో తోడుగా ఉండేందుకు మోడీ సర్కార్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన స్కీమ్‌ ఒకటి. ఇందులో పేద, సన్నకారు రైతులకు నేరుగా రూ.6వేలు వారి ఖాతాల్లో జమ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఏడాదిలో మూడు విడతల్లో ఈ డబ్బులను జమ చేస్తోంది. అయితే ఈ పథకాన్ని అర్హులే కాకుండా అనర్హులు కూడా సద్వినియోగం చేసుకుంటున్నారని అధికారుల విచారణలో తేలింది. ఎలాంటి అర్హతలు లేకుండా పీఎం కిసాన్‌ డబ్బులు పొందుతున్న రైతులను గుర్తించి ఆ డబ్బులను రికవరీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇక ఉత్తరప్రదేశ్‌లో అనర్హులుగా ఉన్న రైతులు ఈ పీఎం కిసాన్‌ డబ్బులు పొందుతున్నట్లు గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. ఈ స్కీమ్‌ను 2018లో ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ.. రైతులకు ఆర్థికంగా ఆదుకుంటున్నారు.

యూపీలో ఆదాయపు పన్ను చెల్లించే రైతులు ఈ పీఎం కిసాన్‌ నిధులను పొందుతున్నారు. అలాంటి రైతుల నుంచి డబ్బులను రికవరీ చేసేందుకు అధికారులు చర్యలు ప్రారంభించాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దుర్గా శంకర్‌ మిశ్రా అన్ని జిల్లాల మెజిస్ట్రేట్‌లకు లేఖ రాశారు. రాష్ట్రంలో ఇలాంటి రైతులన నుంచి దాదాపు రూ.200 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుందని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. యూపీలో3,15,010 మంది రైతులు వ్యవసాయేతర వనరుల నుంచి రూ.2.5లక్షలకుపైగా ఆదాయాన్ని కలిగి ఉన్నారని కేంద్రం ఇటీవల గుర్తించింది. నిరుపేద రైతులు, సన్నకారు రైతులకు సహాయం చేయాలనే లక్ష్యంతో ఇటువంటి పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారని, అర్హులు లేని రైతులు ఈ పథకం సద్వినియోగం చేసుకుంటే చర్యలు తీసుకుంటామని యూపీ ప్రభుత్వం హెచ్చరించింది.

2018లో ఈ పథకం ప్రారంభించిన నాటి నుంచి రాష్ట్రంలో దాదాపు 2.5 కోట్ల మంది రైతులు ఈ పీఎం కిసాన్‌ పథకం నుంచి ప్రయోజనం పొందిన వారున్నారని వ్యవసాయ శాఖ విచారణలో తేలింది. మే 31 నాటికి రైతుల ఇ-కేవైసీ వెరిఫికేషన్‌ నిర్వహించాలని కేంద్ర సర్కార్‌ అన్ని రాష్ట్రాలను కోరింది. అయితే యూపీ ప్రభుత్వం మొత్తం రైతులలో 53 శాతం మందికి మాత్రమే అర్హులుగా గుర్తించింది. రైతులు తమ వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని రెవెన్యూ శాఖ అధికారులను మిశ్రా ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?