Harpreet Singh Bhatia: క్రికెటర్‌ హర్‌ప్రీత్‌సింగ్‌పై చీటింగ్‌, ఫోర్జరీ కేసు నమోదు.. ఎందుకంటే..

Harpreet Singh Bhatia: ఛత్తీస్‌గడ్‌లోని రంజీ ట్రోఫీ జట్టు కెప్టెన్‌పై చీటింగ్‌, ఫోర్జరీ కేసు నమోదైంది. నకిలీ సర్టిఫికేట్లను సమర్పించి ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ అడిట్‌ కార్యాలయంలో ..

Harpreet Singh Bhatia: క్రికెటర్‌ హర్‌ప్రీత్‌సింగ్‌పై చీటింగ్‌, ఫోర్జరీ కేసు నమోదు.. ఎందుకంటే..
Harpreet Singh Bhatia
Follow us

|

Updated on: May 12, 2022 | 7:34 PM

Harpreet Singh Bhatia: ఛత్తీస్‌గడ్‌లోని రంజీ ట్రోఫీ జట్టు కెప్టెన్‌పై చీటింగ్‌, ఫోర్జరీ కేసు నమోదైంది. నకిలీ సర్టిఫికేట్లను సమర్పించి ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ అడిట్‌ కార్యాలయంలో ఉద్యోగం పొందారనే ఆరోపణపై కేసు నమోదు చేసినట్లు రాయ్‌పూర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసు (SP) ప్రశాంత్‌ అగర్వాల్‌ తెలిపారు. అతనిపై ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ సెక్షన్‌ 420 (చీటింగ్‌), 467 (ఫోర్జరీ) కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 2014లో ఛత్తీస్‌గఢ్‌లోని ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగం కోసం నకిలీ గ్రాడ్యుయేషన్‌ సర్టిఫికేట్స్‌ను సమర్పించారని, రంజీ ట్రోఫీ జట్టు కెప్టెన్‌ హర్‌ప్రీత్‌ సింగ్‌ భాటియాపై మోసం, ఫోర్జరీ కేసు నమోదైంది. దీనిపై పోలీసులు మరింత విచారణ చేపడుతున్నారు. అయితే క్రికెటర్‌ తన బి.కామ్‌ డిగ్రీకి సంబంధించిన పత్రాలను సమర్పించాడు. దానిని ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలోని బుందేల్‌ఖండ్‌ విశ్వవిద్యాలయం జారీ చేసినట్లు ఉంది.

2014లో ఉద్యోగం కోసం ప్రకటన వెలువడగా, భాటియా ఆడిటర్‌ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. సర్టిఫికేట్స్‌ ప్రాథమిక ధృవీకరణ తర్వాత ఫీల్డ్‌ ట్రయల్స్‌లో అతని పనితీరు ఆధారంగా భాటియా ఉద్యోగానికి షార్ట్‌లిస్ట్‌ చేయబడింది. భాటియా 2010ఐసీసీ అండర్‌-19 క్రికెట్‌ ప్రపంచ కప్‌లో భారత జట్టులో సభ్యుడు. 2011 ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌లో పూణే వారియర్స్‌ జట్టులో ఎంపికయ్యాడు.

మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి