AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Yogi Aditya: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సంచలన నిర్ణయం.. ఇక నుంచి అక్కడ జాతీయ గీతం తప్పనిసరి

CM Yogi Adityanath: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌ రెండోసారి రాష్ట్ర పగ్గాలు చేపట్టిన తర్వాత దూకుడు పెంచారు. మొదటి నుంచే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న ..

CM Yogi Aditya: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సంచలన నిర్ణయం.. ఇక నుంచి అక్కడ జాతీయ గీతం తప్పనిసరి
Subhash Goud
|

Updated on: May 12, 2022 | 8:31 PM

Share

CM Yogi Adityanath: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌ రెండోసారి రాష్ట్ర పగ్గాలు చేపట్టిన తర్వాత దూకుడు పెంచారు. మొదటి నుంచే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న యోగి.. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌ (Uttar pradesh)లోని మదర్సాలలో జాతీయ గీతం ఆలపించడం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మదర్సా ఎడ్యుకేషన్‌ బోర్డ్‌ కౌన్సిల్‌ మదర్సాలలో ప్రతి రోజు తరగతులు ప్రారంభించడానికి ముందు జాతీయ గీతాన్ని ఆలపించడాన్ని తప్పనిసరి చేస్తూ యోగి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు బీజేపీ అధికారి ప్రతినిధి రాకేష్‌ త్రిపాఠి తెలిపారు.

ఈ జాతీయ గీతం ఆలపించండం వల్ల విద్యార్థులందరిలో జాతీయ భావాన్ని మరింతగా పెంపొందించేలా చేస్తుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యోగి ఆదిత్యనాథ్‌ కీలక నిర్ణయాలే తీసుకుంటున్నారు. మహిళల భద్రత, ప్రజలకు మెరుగైన సేవలు, కొత్త కొత్త పథకాలు వంటి విషయంలలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రశంసలు పొందుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి