Southwest Monsoon: ఈ సారి ముందుగానే నైరుతి రుతుపవనాలు.. చల్లని కబురు అందించిన ఐఎండీ
భగభగ మండుతున్న ఎండలు, తీవ్ర ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు భారత వాతావరణ విభాగం(IMD) తీపి కబురు అందించింది.ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు తొందరగానే పలకరిస్తాయని వెల్లడించింది. అండమాన్, నికోబార్ దీవుల్లో...
భగభగ మండుతున్న ఎండలు, తీవ్ర ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు భారత వాతావరణ విభాగం(IMD) తీపి కబురు అందించింది.ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు తొందరగానే పలకరిస్తాయని వెల్లడించింది. అండమాన్, నికోబార్ దీవుల్లో ఈ నెల 15న ఈ సీజన్ తొలి వర్షాలు కురవొచ్చని ఐఎండీ గురువారం తెలిపింది. మే 15కల్లా నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతం, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి(Bay of Bengal) ప్రవేశించే అవకాశాలున్నాయని స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వచ్చే నెల 5 నుంచి 8 మధ్య నైరుతి రుతుపవనాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరిస్తాయని ఐఎండీ అధికారులు అంచనా వేశారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడినట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. సాధారణంగా రుతు పవనాలు మే 15న నికోబార్ దీవులను దాటుకొని 22కల్లా అండమాన్ దీవుల్లోని ఉత్తర ప్రాంతమైన మాయాబందర్‌ను తాకుతాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మొహపాత్ర తెలిపారు. దీంతో ఏటా జూన్ 1న కేరళలో ప్రవేశించే రుతుపవనాలు ఈ సారి ముందుగానే వస్తాయి.
ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి రుతుపవనాల సీజన్ ఉంటుందని ఐఎండీ ప్రకటించింది. నైరుతి రుతుపవనాల వర్షాలు ఈ ఏడాది సాధారణ స్థాయిలోనే ఉంటుందని అంచనా వేసింది. జూన్ నెలలో నైరుతి రుతుపవనాల ప్రారంభం తర్వాత ఉత్తర, మధ్య భారత్‌లోని చాలా ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని, ఈశాన్య భారతదేశంలోని అనేక ప్రాంతాలు, వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ ద్వీపకల్పంలోని దక్షిణ ప్రాంతాలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీచదవండి
AP Cabinet Meeting: రైతులకు శుభవార్త.. కేబినెట్ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయాలు