AP Cabinet Meeting: రైతులకు శుభవార్త.. కేబినెట్‌ సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ సంచలన నిర్ణయాలు

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నిన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి(CM Jagan) అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. కొత్త మంత్రివర్గం..

AP Cabinet Meeting: రైతులకు శుభవార్త.. కేబినెట్‌ సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ సంచలన నిర్ణయాలు
Follow us
Subhash Goud

|

Updated on: May 13, 2022 | 6:59 AM

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నిన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి(CM Jagan) అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. కొత్త మంత్రివర్గం కొలువుదీరిన తర్వాత మొదటి కేబినెట్‌ సమావేశమిది. గత సంవత్సరం కంటే ముందే వ్యవసాయ సీజన్‌ ప్రారంభించాలని నిర్ణయించారు. రైతులకు సాగునీరు ఇచ్చేందుకు జగన్‌ సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. జూన్‌ 1 నుంచి సాగునీటిని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్‌ 10 నుంచి కృష్ణా డెల్లా, పులిచింతల నీటి వినియోగం, జూన్‌ 30 నుంచి రాయలసీమ ప్రాజెక్టు వినియోగం, జులై 15 నుంచి నాగార్జున సాగర్‌, జులై 10 నుంచి సోమశిల నుంచి నీటిని విడుదల చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇవే కాకుండా మరెన్నో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ కేబినెట్‌ వివరాలను సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వెల్లడించారు.

కేబినెట్‌ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..

☛ సంక్షేమానికి కేలండర్ ప్రకటించిన ప్రకారమే పథకాల అమలు కోసం కేబినెట్ ఆమోదం తెలిపింది

ఇవి కూడా చదవండి

☛ 3 తేదీన కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో మత్స్యకార భరోసా పథకం..

☛ మే 16 తేదీన రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో 5500.

☛ మే 31 తేదీన ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద రూ.2000, రెండు దఫాలుగా రూ.7500 అందజేత.

☛ జూన్ 19 తేదీన యానిమల్ ఆంబులెన్సు లను ప్రారంభించేందుకు కేబినెట్ ఆమోదం.

☛ జూన్ 6న 3 వేల ట్రాక్టర్లు, 402 హార్వెస్టర్ల పంపిణీకి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

☛ జూన్ 14 తేదీన వైఎస్సార్ పంటల భీమా కింద కూడా 2021 ఖరీఫ్ లో నష్టపోయిన రైతులకు బీమా చెల్లింపునకు కేబినెట్ ఆమోదం.

☛ జూన్ 21 తేదీన ప్రతిష్టాత్మకమైన అమ్మ ఒడి పథకం కింద తల్లుల ఖాతాల్లో నిధులు వేసేందుకు కేబినెట్ ఆమోదం తెలియచేసింది.

☛ జూన్ 1 తేదీన వ్యవసాయనికి సాగునీటి విడుదల ప్రణాళికను కూడా ఇచ్చేందుకు మంత్రివర్గం తీర్మానించింది

☛ 2022-27 ఏపీ లాజిస్టిక్ పాలసీ, ప్రోత్సాహకాలను కేబినెట్‌ ఆమోదం.

☛ నెల్లూరు జిల్లా సర్వే పల్లిలో క్రిబ్ కో సంస్థ ద్వారా బయో ఇథనాల్ తయారీకి ఆమోదం.

☛ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలు, రైతు బజార్లలో మౌలిక సదుపాయాల కోసం రూ.1600 కోట్ల రుణ సమీకరణకు కేబినెట్ ఆమోదం.

☛ ప్రతీ జిల్లా కేంద్రం, కార్పోరేషన్ లో అత్యాధునిక వైద్య సౌకర్యాల కోసం మెడికల్ హబ్‌ల ఏర్పాటుకు ఆమోదం.

☛ మచిలీపట్నం, ప్రకాశం జిల్లా ఒంగోలు, కొత్తూరు, కడప జిల్లాల్లో తదితర ప్రాంతాల్లో అత్యాధునిక ఆస్పత్రుల నిర్మాణం కోసం భూ కేటాయింపు.

☛ నెల్లూరు జిల్లాలో టెక్స్ టైల్ పార్కు కోసం భూ కేటాయింపు చేస్తూ కేబినెట్ నిర్ణయం.

☛ పెనుగొండలో పర్యాటకుల కోసం ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటుకు 40 ఎకరాలు భూమి కేటాయింపునకు కేబినెట్‌ ఆమోదం.

☛ నెల్లూరు జిల్లాలో టెక్స్‌టైల్‌ పార్క్ ఏర్పాటుకు కావాల్సిన భూమిని కేటాయింపు.

☛ రేపల్లెను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి