విమానంలో ఉగ్రవాది ఉన్నాడంటూ వ్యక్తి హల్‌చల్
ఈ విమానంలో ఉగ్రవాది ఉన్నాడంటూ అందులో ఉన్న ఓ ప్రయాణికుడు హల్‌చల్ చేశాడు. దీంతో ప్రయాణికులు, అధికారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

Passenger claims terrorist: ఈ విమానంలో ఉగ్రవాది ఉన్నాడంటూ అందులో ఉన్న ఓ ప్రయాణికుడు హల్‌చల్ చేశాడు. దీంతో ప్రయాణికులు, అధికారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న ఎయిరిండియా విమానంలో ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. విమానాన్ని ఎక్కిన జిలా ఉల్ హక్ అనే వ్యక్తి తాను స్పెషల్ సెల్ అధికారిని అని, ఇందులో ఉగ్రవాది ఉన్నాడని అన్నాడు. దాంతో అందరూ టెన్షన్ పడ్డారు. ఇక విమానంను డబోలిమ్ విమానాశ్రయంలో ఆపి, అతడిని సీఐఎస్‌ఎఫ్ పోలీసులకు అప్పగించారు. వారి విచారణలో జియా ఉల్ హక్‌కి మతి స్థిమితం సరిగా లేదని తేలింది. అతడు ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడని.. స్థానిక ఆసుపత్రిలో వైద్య పరీక్షలు తరువాత అతడిని పనాజీలోని మానసిక వ్యాధుల చికిత్స కేంద్రంలో చేర్చినట్లు అధికారులు వెల్లడించారు.
Read More: