తక్కువ అంచనా వేయకండి.. తగ్గుతున్నవి కేసులు మాత్రమే: రాకేష్‌ మిశ్రా

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాను తక్కువ అంచనా వేయొద్దని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్‌ మాలిక్యులర్ బయాలజీ డైరెక్టర్ డాక్టర్ రాకేష్‌ మిశ్రా అన్నారు

తక్కువ అంచనా వేయకండి.. తగ్గుతున్నవి కేసులు మాత్రమే: రాకేష్‌ మిశ్రా
Follow us

| Edited By:

Updated on: Oct 23, 2020 | 2:40 PM

Corona Vaccine Rakesh Mishra: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాను తక్కువ అంచనా వేయొద్దని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్‌ మాలిక్యులర్ బయాలజీ డైరెక్టర్ డాక్టర్ రాకేష్‌ మిశ్రా అన్నారు. ఈ మహమ్మారికి వ్యాక్సిన్ వచ్చినా అది శాశ్వత రక్షణ ఇవ్వకపోవచ్చునని ఆయన స్పష్టం చేశారు. కరోనా వ్యాక్సిన్‌ని దేశవ్యాప్తంగా అందరికీ అందించేందుకు చాలా సమయం పడుతుందని ఆయన తెలిపారు. అంతేకాదు అన్ని ట్రయల్స్‌లో విజయవంతమైన వ్యాక్సిన్‌ వచ్చినా మధ్యవయస్సు వారిలో దీర్ఘకాలంగా సంరక్షణ ఉంటుందని చెప్పలేమని రాకేష్‌ మిశ్రా వెల్లడించారు.

ప్రస్తుతం మనముందు మూడు సవాళ్లు ఉన్నాయి. ఒకటవది.. పలు వయసుల వారికి ఈ వ్యాక్సిన్‌ ఎంతమేర పనిచేయగలదని తెలుసుకునేందుకు మనకు మరిన్ని సంవత్సరాలు పట్టొచ్చు. వ్యాక్సిన్‌ వచ్చి, దాన్ని వాడిని కొన్ని నెలల తరువాత ఫలితాలు తెలుస్తాయి. రెండవది కరోనాకు చాలా మంది వ్యాక్సిన్‌ని కనుగొనేపనిలో ఉన్నారు. ఒకవేళ అమెరికాలో తయారు చేస్తోన్న mRNA వ్యాక్సిన్ విజయవంతం అయితే, దాన్ని 80డిగ్రీల సెల్సియస్ ప్రదేశంలో స్టోర్ చేయాల్సి ఉంటుంది. అలాంటి వ్యాక్సిన్‌ని మన పల్లెటూరులలో ఇచ్చేందుకు సరైన సదుపాయాలు లేవు. మూడో సవాల్‌.. మన దేశంలోని 1.3 మిలియన్ల జనానికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు చాలా సమయమే పట్టనుంది అని ఆయన తెలిపారు. ఈ వైరస్ బారి నుంచి బయటపడాలంటే వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలని, అలాగే మాస్క్‌లను ధరించాలని రాకేష్‌ మిశ్రా సూచించారు. ప్రస్తుతం తగ్గుతున్న కేసులను చూసి కరోనా తగ్గిపోయిందని భావించకూడదని.. తగ్గుతున్నది కేసులు మాత్రమేనని.. తీవ్రత కాదని క్లారిటీ ఇచ్చారు.

Read More:

నిత్యామీనన్‌తో అవసరాల థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌..!

విమానంలో ఉగ్రవాది ఉన్నాడంటూ వ్యక్తి హల్‌చల్‌

Latest Articles
బుద్ధిమంతులకే బ్రాండ్‌ అంబాసిడర్‌.. అతని షర్ట్‌లోనే ఉంది ట్విస్ట్
బుద్ధిమంతులకే బ్రాండ్‌ అంబాసిడర్‌.. అతని షర్ట్‌లోనే ఉంది ట్విస్ట్
హైదరాబాద్ నుంచి శ్రీలంకకు IRCTC తక్కువ ధరకే అందిస్తోన్న ప్యాకేజ్
హైదరాబాద్ నుంచి శ్రీలంకకు IRCTC తక్కువ ధరకే అందిస్తోన్న ప్యాకేజ్
ఐపీఎల్ 2024 ఛాంపియన్‌గా కోల్‌కత్తా.. చేయందించిన ముంబై
ఐపీఎల్ 2024 ఛాంపియన్‌గా కోల్‌కత్తా.. చేయందించిన ముంబై
ఎన్నికల మధ్య దేశంలో ఉల్లిపై ప్రభుత్వం కీలక నిర్ణయం
ఎన్నికల మధ్య దేశంలో ఉల్లిపై ప్రభుత్వం కీలక నిర్ణయం
బాబోయ్‌ ఇదో దెయ్యాల కోట..! సాయంత్రం 6 దాటితే వింత శబ్ధాలు,అరుపులు
బాబోయ్‌ ఇదో దెయ్యాల కోట..! సాయంత్రం 6 దాటితే వింత శబ్ధాలు,అరుపులు
ఎల్లప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉండాలనుకుంటున్నారా? ఈ స్నాక్స్ తినండి
ఎల్లప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉండాలనుకుంటున్నారా? ఈ స్నాక్స్ తినండి
ఖలిస్తానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హంతకుడు ఎవరు?
ఖలిస్తానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హంతకుడు ఎవరు?
ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న శోభా శెట్టి..
ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న శోభా శెట్టి..
సాహస క్రీడలు అంటే ఇష్టమా.. ఉత్తరాకాండ్ లోని ఈ ప్రసిద్ధ ప్రాంతాలు
సాహస క్రీడలు అంటే ఇష్టమా.. ఉత్తరాకాండ్ లోని ఈ ప్రసిద్ధ ప్రాంతాలు
హైవేపై దూసుకొస్తున్న ఫోర్డ్ కారు.. ఆపి చెక్ చేయగా కళ్లు చెదిరేలా!
హైవేపై దూసుకొస్తున్న ఫోర్డ్ కారు.. ఆపి చెక్ చేయగా కళ్లు చెదిరేలా!