Indigo Flights: ఎయిర్ హోస్టెస్‌తో అసభ్యకర ప్రవర్తణ.. ప్రయాణికుడికి షాక్ ఇచ్చిన ఇండిగో ఎయిర్‌లైన్స్!
మద్యం తాగి విమానంలో ఎయిర్ హోస్టెర్‌తో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఢిల్లీ-షిర్డీ వెళ్తున్న ఇండిగో విమానం మిమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఎయిర్ హోస్టెస్‌తో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను అనుచితంగా తాకుతూ ఇబ్బందికి గురిచేశాడు. దీంతో ఎయిర్ హోస్టెస్ మేనేజర్‌కు సమాచారం చేయడంతో అతను పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఫ్లైట్ షిర్డీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన వెంటనే అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు.

మద్యం తాగిన ఓ ప్రయాణికుడు విమానంలోని ఎయిర్ హోస్టెర్‌తో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకరాం.. ఓ ఇండిగో విమానం విమానం ఢిల్లీ నుండి మహారాష్ట్రలోని షిర్డీకి బయల్దేరింది. అయితే విమానంలోని ఓ ప్రయాణికుడు మద్యం తాగి ఫ్లైట్‌లోని ఎయిర్ హోస్టెస్‌తో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను అసభ్యకరంగా తాకుతూ ఇబ్బందులకు గురిచేశాడు. ఆ ప్రయాణికుడి అసభ్యకర ప్రవర్తనతో విసిగిపోయిన ఎయిర్ హోస్టెస్ తన మేనేజర్‌కు సమాచారం అందించింది. దీంతో విమానం షిర్డీ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన వెంటనే ఆ మేనేజర్ భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. ఇక వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఆ తర్వాత అతన్ని రహతా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఎయిర్ హోస్టెర్ ఫిర్యాదు మేరకు ఆ ప్రయాణికుడిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. తర్వాత అతనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో అతను మద్యం సేవించినట్టు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత అతనికి నోటీసులు అందజేశారు.
ఈ సంఘటనపై ఎయిర్ లైన్స్ సంస్థ ఇండిగో స్పందించింది. “మే 2న ఢిల్లీ నుండి షిర్డీకి వెళ్లే 6E 6404 విమానంలో క్యాబిన్ సిబ్బంది పట్ల ఒక కస్టమర్ అసభ్యంగా ప్రవర్తించినట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. తమ సిబ్బంది ప్రమాణిక ప్రామాణిక విధానాలను పాటించారని.. ఆ ప్రయాణికుడే అసభ్యంగా ప్రవర్తించారని పేర్కొంది. ఇండిగోలో, అందరికీ సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణాన్ని అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని, ప్రయాణికులకు ఏదైనా అసౌకర్యం కలిగి ఉంటే చింతిస్తున్నాము” అని ఎయిర్‌లైన్ ఓ ప్రకటనలో పేర్కొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
