PM Modi: వర్షాకాల సమావేశాలకు ముందు ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు! శుంభాన్షు శుక్లాపై ప్రశంసలు
నేటి నుండి ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు ప్రధాని మోదీ ప్రసంగించారు. భారత్ నుంచి అంతరిక్ష యానం చేసిన శుభాంశు శుక్లాను కొనియాడారు. ఆపరేషన్ సింధూర్ లో భారత సైన్యం సాధించిన విజయాలను గుర్తుచేశారు. వర్షాకాల సమావేశాల ప్రాముఖ్యతను ప్రధాని నొక్కిచెప్పారు.

నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ప్రధాని మోదీ పార్లమెంటు భవనానికి చేరుకున్నారు. సమావేశాలకు ముందు పార్లమెంట్ బయట ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్బంగా ప్రధాని మాట్లాడుతూ.. వర్షాకాల సమావేశాలకు ప్రాధాన్యం ఉందన్నారు. అలాగే అంతరిక్ష రంగంలో భారత్ చరిత్ర సృష్టించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇటీవలె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కొన్ని రోజులు ఉండి వచ్చిన శుభాంశు శుక్లాను ప్రధాని మోదీ కొనియాడారు. ఆపరేషన్ సింధూర్‌లో భారత సైన్యం తమ లక్ష్యాలను 100 శాతం పూర్తిచేసిందని గుర్తు చేశారు.
భారత సైనిక బలగాల సత్తాను ప్రపంచం చూసింది. మేడిన్ ఇండియా ఆయుధాలు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి అని అన్నారు. అలాగే దేశంలో శాంతి, ప్రగతి కలిసి నడుస్తున్నాయని, దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్న ఉగ్రవాదం, నక్సలిజాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తున్నామని పేర్కొన్నారు. వందలాది జిల్లాలు నక్సలిజం నుంచి విముక్తి పొందాయని వెల్లడించారు. రెడ్ కారిడార్‌గా చెప్పుకున్న ప్రాంతం, ఇప్పుడు గ్రీన్ గ్రోత్ జోన్‌లో ఉందని ప్రధాని మోదీ అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




