ఫిబ్రవరి 1 న రైతుల పార్లమెంట్ మార్చ్ రద్దు, అయితే ఈ నెల 30 న దేశవ్యాప్తంగా ధర్నాలు

ఫిబ్రవరి 1 న  తలపెట్టిన పార్లమెంట్ మార్చ్ ను రైతు సంఘాలు రద్దు చేసుకున్నాయి. అయితే ఈ నెల 30 న మహాత్మా గాంధీ వర్ధంతి నాడు  దేశవ్యాప్తంగా..

ఫిబ్రవరి 1 న రైతుల పార్లమెంట్ మార్చ్ రద్దు, అయితే ఈ నెల 30 న దేశవ్యాప్తంగా ధర్నాలు
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 28, 2021 | 10:50 AM

ఫిబ్రవరి 1 న  తలపెట్టిన పార్లమెంట్ మార్చ్ ను రైతు సంఘాలు రద్దు చేసుకున్నాయి. అయితే ఈ నెల 30 న మహాత్మా గాంధీ వర్ధంతి నాడు  దేశవ్యాప్తంగా నిరాహార దీక్షలు, ధర్నాలు జరుగుతాయని ఈ సంఘాలు ప్రకటించాయి. పార్లమెంట్ మార్చ్ ను రద్దు చేసుకున్నంత మాత్రాన మా నిరసన ఉద్యమం ఆగదని, వివాదాస్పద చట్టాలను  కేంద్రం రద్దు చేసేంతవరకు ఆందోళన కొనసాగుతుందని రైతు నేతలు వెల్లడించారు. ఢిల్లీలో శాంతియుతంగా సాగుతుందనుకున్న ట్రాక్టర్ ర్యాలీలో కొన్ని సంఘ విద్రోహ శక్తులు పాల్గొన్న ఫలితంగానే అది హింసాత్మకంగా మారిందని వారన్నారు. ఈ ర్యాలీలో అవాంఛనీయ శక్తులు జోక్యం చేసుకున్నాయన్న విషయాన్ని వారు అంగీకరించారు. ఇలా ఉండగా యోగేంద్ర యాదవ్, బల్ దేవ్ సింగ్ సిర్సా, బల్బీర్ సింగ్   రాజేవాల్ సహా 20 మంది రైతు నాయకులకు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు.  26 న ట్రాక్టర్ ర్యాలీని శాంతియుతంగా నిర్వహిస్తామని ఒప్పందం కుదుర్చుకుని కూడా దాన్ని ఉల్లంఘించారని వారు ఈ నోటీసుల్లో ఆరోపించారు. వీటికి మూడు రోజుల్లోగా సమాధానమివ్వాలని ఆదేశించారు.  అటు హోం  మంత్రి అమిత్ షా ..రిపబ్లిక్ డే రోజున ఏయే రైతు సంఘాలు అల్లర్లకు బాధ్యత వహించాయో కనుగొనాలని పోలీసులకు సూచించారు.