AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Marriages: ప్రేమ పెళ్లిళ్లకు తల్లితండ్రుల అనుమతి తప్పనిసరి: ముఖ్యమంత్రి భూపేంద్ర

ప్రేమ వివాహాలకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేస్తూ కొత్త చట్టాన్నితీసుకొస్తామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ వ్యాఖ్యానించారు. సాధ్యమైతే రాజ్యాంగబద్ధంగా ఈ ప్రతిపాదనను అమలులోకి తెస్తామని ఆయన పేర్కొన్నారు. ఇంటి నుంచి పారిపోయిన బాలికల కేసులను పోలీసులు సమీక్షించాలని ఆదేశించారు. ప్రేమ వివాహాలు రాజ్యాంగ విరుద్ధంకాకపోతే తమ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను అధ్యయనం చేస్తుందన్నారు. పాటీదార్ వర్గానికి ప్రాతినిధ్యం వహించే ‘సర్దార్ పటేల్ గ్రూప్ (SPG)’ మెహ్సానాలో నిర్వహించిన..

Love Marriages: ప్రేమ పెళ్లిళ్లకు తల్లితండ్రుల అనుమతి తప్పనిసరి: ముఖ్యమంత్రి భూపేంద్ర
Love Marriage
Srilakshmi C
|

Updated on: Aug 01, 2023 | 10:30 AM

Share

గాంధీనగర్, ఆగస్టు 1: ప్రేమ వివాహాలకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేస్తూ కొత్త చట్టాన్నితీసుకొస్తామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ వ్యాఖ్యానించారు. సాధ్యమైతే రాజ్యాంగబద్ధంగా ఈ ప్రతిపాదనను అమలులోకి తెస్తామని ఆయన పేర్కొన్నారు. ఇంటి నుంచి పారిపోయిన బాలికల కేసులను పోలీసులు సమీక్షించాలని ఆదేశించారు. ప్రేమ వివాహాలు రాజ్యాంగ విరుద్ధంకాకపోతే తమ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను అధ్యయనం చేస్తుందన్నారు. పాటీదార్ వర్గానికి ప్రాతినిధ్యం వహించే ‘సర్దార్ పటేల్ గ్రూప్ (SPG)’ మెహ్సానాలో నిర్వహించిన సమావేశానికి సీఎం భూపేంద్ర పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌ కూడా హాజరయ్యారు. పాటీదార్ వర్గం నుంచి వస్తున్న డిమాండ్లకు స్పందనగా ముఖ్యమంత్రి ఈ మేరకు ప్రేమ పెళ్లిలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రేమ వివాహానికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేయాలని పటీదార్‌ సామాజికవర్గంలోని ఒక వర్గం డిమాండ్‌ చేయడంతో సీఎం భూపేంద్ర పటేల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అహ్మదాబాద్‌లోని జమాల్‌పూర్-ఖాదియా నియోజకవర్గానికి చెందిన ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీఎంకు మద్దతు పలికారు. ప్రభుత్వం అలాంటి చట్టం తెస్తే తమ మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ‘అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వం అలాంటి చట్టాన్ని తీసుకువస్తే.. నేను ప్రభుత్వానికి మద్దతిస్తాను’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేదావాలా అన్నారు. ఇది ప్రేమ వివాహాలు కేవలం హిందూ-ముస్లింల సమస్య కాదని, రెండు కుటుంబాలకు సంబంధించినదని అని ఖేదావాలా పేర్కాన్నారు. ఆడపిల్ల ఇంటి నుంచి పారిపోతే సమాజ వివక్ష ఆ కుటుంబం ఎదుర్కోలేక విచ్ఛిన్నమైపోతుందన్నారు. పిల్లలను పెంచేది తల్లిదండ్రులే కాబట్టి వారి అంగీకారం తప్పనిసరి చేయాలి. తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా ఆడపిల్లలు పారిపోయినా.. ఆ తర్వాత అలా వెళ్లిపోయినందుకు పశ్చాత్తాపపడిన సందర్భాలు అనేకం ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు.

2021లో బీజేపీ ప్రభుత్వం గుజరాత్ మత స్వేచ్ఛా చట్టాన్ని సవరించింది. అందులో వివాహం ద్వారా బలవంతంగా మతం మారడం శిక్షార్హమైన నేరంగా ప్రకటించబడింది. ఎవరైనా ఇలా బలవంతంగా మతమార్పిడికి పాల్పడితే గరిష్ఠంగా 10 ఏళ్ల శిక్ష విధించేలా నిబంధన చేసింది. ఐతే ఈ చట్టంలోని వివాదాస్పద సెక్షన్‌పై ఆ రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.