బాలాకోట్‌ సెక్టార్‌ మీదుగా కాల్పులకు తెగబడ్డ పాక్‌

పాక్‌ తన వక్రబుద్దిని మార్చుకోవడం లేదు. నిత్యం సరిహద్లుల వెంట కాల్పులకు తెగబడుతోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ కయ్యానికి కాలు దువ్వుతోంది. తాజాగా. గురువారం రాత్రి మరోసారి..

బాలాకోట్‌ సెక్టార్‌ మీదుగా కాల్పులకు తెగబడ్డ పాక్‌

పాక్‌ తన వక్రబుద్దిని మార్చుకోవడం లేదు. నిత్యం సరిహద్లుల వెంట కాల్పులకు తెగబడుతోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ కయ్యానికి కాలు దువ్వుతోంది. తాజాగా. గురువారం రాత్రి మరోసారి కాల్పులకు దిగింది. పూంచ్‌ జిల్లాలోని మేందర్‌, బాలాకోట్‌ సెక్టార్‌లలో కాల్పులు చేపట్టింది. చిన్న ఆయుధాలతో పాటుగా.. మోర్టార్‌ షెల్స్‌ను ఉపయోగించి ఈ దుశ్చర్యకు పాల్పడింది. ఈ సంఘటన రాత్రి 8.00 గంటల ప్రాంతంలో చోటుచేసుకుందని భారత ఆర్మీ అధికారులు తెలిపారు. కాగా, బుధవారం రాత్రి కూడా పూంచ్‌ జిల్లాలోని మరో సరిహద్దు ప్రాంతంపై కాల్పులకు తెగబడింది. పాక్‌ తీరుపై భారత్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో పాక్‌కు ధీటుగా భారత ఆర్మీ కూడా ఎదురుదాడి చేపట్టిందని అధికారులు తెలిపారు.

Read More :

దేశ రాజధానిలో పెరిగిన కరోనా కేసులు

మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

Click on your DTH Provider to Add TV9 Telugu