కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి ఈడీ సమన్లు

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సీనియర్ నేత పి. చిదంబ‌రానికి సోమవారం ఈడీ నోటీసులు జారీ చేసింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న ఏవియేషన్ స్కామ్ ఆరోపణల్లో చిదంబరం స్టేట్‌మెంట్ రికార్డు చేసేందుకు ఈనెల 23న తమ ముందు హాజరుకావాలని ఈడీ ఆ నోటీసుల్లో పేర్కొంది. బోయింగ్, ఎయిర్‌బస్‌ల నుంచి రూ.70,000 కోట్లకు విమానాల కొనుగోలుకు సంబంధించిన ఈ కేసులో కేంద్ర పౌర విమానయాన శాఖ మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్‌కు కూడా ఇటీవల ఈడీ […]

కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి ఈడీ సమన్లు
Follow us

| Edited By:

Updated on: Aug 19, 2019 | 8:21 PM

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సీనియర్ నేత పి. చిదంబ‌రానికి సోమవారం ఈడీ నోటీసులు జారీ చేసింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న ఏవియేషన్ స్కామ్ ఆరోపణల్లో చిదంబరం స్టేట్‌మెంట్ రికార్డు చేసేందుకు ఈనెల 23న తమ ముందు హాజరుకావాలని ఈడీ ఆ నోటీసుల్లో పేర్కొంది.

బోయింగ్, ఎయిర్‌బస్‌ల నుంచి రూ.70,000 కోట్లకు విమానాల కొనుగోలుకు సంబంధించిన ఈ కేసులో కేంద్ర పౌర విమానయాన శాఖ మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్‌కు కూడా ఇటీవల ఈడీ సమన్లు జారీ చేసింది. అప్పట్లో బోయింగ్, ఎయిర్‌బస్ నుంచి 111 విమానాలను రూ.70,000 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంలో లాభదాయకమైన మార్గాలు, ప్రైవేటు విమానయాన సంస్థలకు షెడ్యూల్ ఇవ్వడం, విదేశీ పెట్టుబడులతో శిక్షణా సంస్థలు ప్రారంభించడం వంటి ఆరోపణలు వచ్చాయి.