AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విషాదంగా మారిన విహారయాత్ర

బీటెక్‌ పూర్తి..క్యాంపస్‌ సెలెక్షన్స్‌లో 3 కంపెనీల్లో సెలక్ట్‌ అయ్యాడు.. కానీ,అంతలోనే ఊహించని ఉప్పెన ఆ యువకున్ని మింగేసింది. హిమాచల్‌ప్రదేశ్‌ విహార యాత్రకు వెళ్లిన కడప జిల్లా యవకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. దీంతో జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం మేకల బాలాయపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎర్రగుంట్ల మండల పరిధిలోని మేకల బాలయ్యపల్లిలో నివాసముంటున్న గోగుల రమణయ్యకు ఇద్దరు కుమారులు ఓ కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడైన గోగుల ముని రాఘవ ఇటీవల పంజాబ్‌ లవ్లీ యూనివర్సిటీలో బీటెక్‌ […]

విషాదంగా మారిన విహారయాత్ర
Anil kumar poka
|

Updated on: Aug 19, 2019 | 6:35 PM

Share

బీటెక్‌ పూర్తి..క్యాంపస్‌ సెలెక్షన్స్‌లో 3 కంపెనీల్లో సెలక్ట్‌ అయ్యాడు.. కానీ,అంతలోనే ఊహించని ఉప్పెన ఆ యువకున్ని మింగేసింది. హిమాచల్‌ప్రదేశ్‌ విహార యాత్రకు వెళ్లిన కడప జిల్లా యవకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. దీంతో జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం మేకల బాలాయపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎర్రగుంట్ల మండల పరిధిలోని మేకల బాలయ్యపల్లిలో నివాసముంటున్న గోగుల రమణయ్యకు ఇద్దరు కుమారులు ఓ కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడైన గోగుల ముని రాఘవ ఇటీవల పంజాబ్‌ లవ్లీ యూనివర్సిటీలో బీటెక్‌ పూర్తి చేశాడు. క్యాంపస్‌ సెలక్షన్స్‌లో దాదాపు 3 కంపెనీలకు సెలెక్ట్‌ అయ్యాడు. ఈ సందర్బంగా స్నేహితులతో కలిసి హిమాచల్‌ప్రదేశ్‌ విహారయాత్రకు వెళ్లాడు. అక్కడ కొండచరియలు విరిగిపడిన ఘటనలో రాఘవ మృతిచెందాడు.

ఈ విషయం అతని స్నేహితులు తల్లిదండ్రులకు ఫోన్‌చేసి చెప్పడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. లక్షల్లో అప్పులు చేసి కొడుకును చదివిస్తే..చేతికందొస్తాడని ఆశపడ్డ ఆ తల్లీదండ్రులకు నిరాశే మిగిలింది. రాఘవ మరణవార్త ఆ గ్రామస్తులను సైతం శోక సంద్రంలో ముంచేసింది. ముని రాఘవ మృతదేహన్ని ఢిల్లీ నుండి ప్రభుత్వ సహాయంతో స్వగ్రామానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు.

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. పాలిటెక్నిక్‌లో 9 కొత్త కోర్సులు!
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. పాలిటెక్నిక్‌లో 9 కొత్త కోర్సులు!
సందీప్‌ని గుర్తుచేసిన గీతూ...అంతకు మించి అంటున్న ఆడియన్స్
సందీప్‌ని గుర్తుచేసిన గీతూ...అంతకు మించి అంటున్న ఆడియన్స్
చికెన్‌లోని ఈ పార్ట్స్ యమ స్పెషల్.. తిన్నారంటే ఆ రోగాల మాటే ఉండదు
చికెన్‌లోని ఈ పార్ట్స్ యమ స్పెషల్.. తిన్నారంటే ఆ రోగాల మాటే ఉండదు
మురుగు కాలువను క్లీన్ చేస్తున్న కార్మికులు.. కాళ్ల కింద కనిపించిన
మురుగు కాలువను క్లీన్ చేస్తున్న కార్మికులు.. కాళ్ల కింద కనిపించిన
క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్లను ఎలా రీడీమ్ చేసుకోవాలి?
క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్లను ఎలా రీడీమ్ చేసుకోవాలి?
ఆర్థిక ఇబ్బందులను దూదిలా ఊదేయండి.. ఈజీ టిప్స్
ఆర్థిక ఇబ్బందులను దూదిలా ఊదేయండి.. ఈజీ టిప్స్
నిద్రలేని రాత్రులు గడిపానన్న విజయ్‌... మెగాస్టార్‌కి ఊరట!
నిద్రలేని రాత్రులు గడిపానన్న విజయ్‌... మెగాస్టార్‌కి ఊరట!
వామ్మో.. షుగర్ వల్ల దేశంలో ఇన్ని లక్షల కోట్ల నష్టమా.. డాక్టర్లు..
వామ్మో.. షుగర్ వల్ల దేశంలో ఇన్ని లక్షల కోట్ల నష్టమా.. డాక్టర్లు..
హోంగార్డ్ సర్వీసుల్లోకి ట్రాన్స్ జెండర్స్.. నియామక పత్రాలు అందజేత
హోంగార్డ్ సర్వీసుల్లోకి ట్రాన్స్ జెండర్స్.. నియామక పత్రాలు అందజేత
ప్రపంచంలోనే అత్యంత వింతైన బీచ్..వెలుగులోకి 150 ఏళ్ల నాటి మిస్టరీ!
ప్రపంచంలోనే అత్యంత వింతైన బీచ్..వెలుగులోకి 150 ఏళ్ల నాటి మిస్టరీ!