ఫుట్​బాల్​ గ్రౌండ్‌లో ఫ్యాన్ వార్..నలుగురు మృతి

నేషనల్ లెవల్  ఫుట్​బాల్​ మ్యాచ్​‌లు జరుగుతూ ఫ్యాన్స్‌కు ఎంజాయ్‌మెంట్ ఇచ్చే  ఆ స్టేడియంలో అదే అభిమానుల రక్తం పారింది.  క్రీడాకారులకు ఉత్సాహం నింపుతూ, ఆటను ఆస్వాదించాల్సిన అభిమానులు గుండాల్లా మారారు. పరస్పరం దాడులు చేసుకుని… నలుగురు ప్రాణాలు కోల్పోయేందుకు కారణమయ్యారు. హోండురస్​ రాజధాని టెగుసిగల్పలోని నేషనల్ స్టేడియంలో మోటాగువా, ఒలింపియా జట్ల మధ్య ఫుట్​బాల్​ మ్యాచ్​కు అధికారులు ఏర్పాట్లు చేశారు. మోటాగువా జట్టు సభ్యులు మైదానానికి బయలుదేరిన సమయంలో… ప్రత్యర్థి జట్టు అభిమానులు వారి బస్సుపై దాడికి […]

ఫుట్​బాల్​ గ్రౌండ్‌లో ఫ్యాన్ వార్..నలుగురు మృతి
Football match leads to four deaths and seven injuries
Follow us

|

Updated on: Aug 19, 2019 | 1:21 PM

నేషనల్ లెవల్  ఫుట్​బాల్​ మ్యాచ్​‌లు జరుగుతూ ఫ్యాన్స్‌కు ఎంజాయ్‌మెంట్ ఇచ్చే  ఆ స్టేడియంలో అదే అభిమానుల రక్తం పారింది.  క్రీడాకారులకు ఉత్సాహం నింపుతూ, ఆటను ఆస్వాదించాల్సిన అభిమానులు గుండాల్లా మారారు. పరస్పరం దాడులు చేసుకుని… నలుగురు ప్రాణాలు కోల్పోయేందుకు కారణమయ్యారు. హోండురస్​ రాజధాని టెగుసిగల్పలోని నేషనల్ స్టేడియంలో మోటాగువా, ఒలింపియా జట్ల మధ్య ఫుట్​బాల్​ మ్యాచ్​కు అధికారులు ఏర్పాట్లు చేశారు. మోటాగువా జట్టు సభ్యులు మైదానానికి బయలుదేరిన సమయంలో… ప్రత్యర్థి జట్టు అభిమానులు వారి బస్సుపై దాడికి దిగారు. రాళ్లు, నీళ్ల సీసాలు విసిరారు. ఈ ఘటనలో కొందరు ఆటగాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.

తమ అభిమాన జట్టుపై దాడి సంగతి తెలియగానే మోటాగువా ఫ్యాన్స్​ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఒలింపియా జట్టు అభిమానులపై వారు ప్రతిదాడికి దిగారు. మ్యాచ్​ నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించినా… ఫ్యాన్స్​ అంతా స్టేడియంలోనే ఉండి గొడవపడ్డారు. ఒకరిని ఒకరు కొట్టుకున్నారు. తుపాకీతో కాల్పులు జరిపారు. పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి, వీరిని చెదరగొట్టారు. ఈ ఘర్షణల్లో నలుగురు మరణించారు. ఘర్షణల నేపథ్యంలో నేషనల్ స్టేడియాన్ని తాత్కాలికంగా మూసివేశారు.