11 ఏళ్ల క్రికెట్ చరిత్రలో… రికార్డుల రారాజుగా… !

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి ఇప్పటికి 11 సంవత్సరాలు గడిచాయి. 2008, ఆగస్టు 18న శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌తో భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్ తొలి మ్యాచ్‌లో అనూహ్యంగా ఓపెనర్‌గా వెళ్లి 12 పరుగులకే వికెట్ చేజార్చుకున్నాడు. కానీ.. ఇప్పుడు వన్డేల్లో 43 శతకాలతో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ (49) అత్యధిక శతకాల రికార్డ్‌కి అత్యంత చేరువలో ఉన్నాడు. ఇటీవల వెస్టిండీస్‌పై వన్డే సిరీస్‌లో […]

  • Tv9 Telugu
  • Publish Date - 12:46 pm, Mon, 19 August 19
11 ఏళ్ల క్రికెట్ చరిత్రలో... రికార్డుల రారాజుగా... !

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి ఇప్పటికి 11 సంవత్సరాలు గడిచాయి. 2008, ఆగస్టు 18న శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌తో భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్ తొలి మ్యాచ్‌లో అనూహ్యంగా ఓపెనర్‌గా వెళ్లి 12 పరుగులకే వికెట్ చేజార్చుకున్నాడు. కానీ.. ఇప్పుడు వన్డేల్లో 43 శతకాలతో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ (49) అత్యధిక శతకాల రికార్డ్‌కి అత్యంత చేరువలో ఉన్నాడు. ఇటీవల వెస్టిండీస్‌పై వన్డే సిరీస్‌లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు బాదిన విరాట్ కోహ్లీ.. ఒక దశాబ్దంలో 20వేల పరుగులు చేసిన ఏకైక క్రికెటర్‌గా ఘనత సాధించిన విషయం తెలిసిందే.

సుదీర్ఘ కెరీర్‌లో 77 టెస్టులాడిన విరాట్ కోహ్లీ ఆరు డబుల్ సెంచరీలు, 25 శతకాలతో ప్రస్తుతం 6,613 పరుగులతో కొనసాగుతున్నాడు. ఇక 239 వన్డేలాడిన ఈ భారత కెప్టెన్ ఏకంగా 43 శతకాలు, 54 హాఫ్ సెంచరీలతో 11,520 పరుగులతో ఉన్నాడు. టీ20ల్లోనూ 70 మ్యాచ్‌ల్లో కోహ్లీ 2,369 పరుగులు చేశాడు. మొత్తంగా.. దశాబ్దాల రికార్డుల బూజు దులుపుతున్న విరాట్ కోహ్లీ.. మరో ఐదేళ్లపాటు క్రికెట్ ఆడితే… టెండూల్కర్ శతకాల రికార్డులు బద్దలవడంతో పాటు మరిన్ని సరికొత్త రికార్డులు నెలకొల్పడం ఖాయంగా కనిపిస్తోంది.