టీమిండియాకు టెర్రర్ త్రెట్… భద్రత కట్టుదిట్టం!

వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న టీమిండియాకు ఉగ్రముప్పు పొంచి ఉందని భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ)కి మెయిల్‌ రావడం కలకలం రేపింది. విండీస్‌ పర్యటనలో ఉన్న భారత క్రికెటర్ల కదలికల్ని ఎప్పటికప్పుడూ ఫాలో అవుతున్నామని,  ఆటగాళ్లు ప్రమాదంలో ఉన్నారంటూ బీసీసీఐకి మెయిల్‌ వచ్చింది. ఆదివారం వచ్చిన ఈ మెయిల్‌ బీసీసీఐ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే ఆంటిగ్వాలోని భారత హైకమిషన్‌కు సమాచారమిచ్చామని ఓ బీసీసీఐ అధికారి పీటీఐకి చెప్పారు. ఈ నేపథ్యంలో హైకమిషన్‌.. స్థానిక ప్రభుత్వ యంత్రంగాన్ని అప్రమత్తం […]

టీమిండియాకు టెర్రర్ త్రెట్... భద్రత కట్టుదిట్టం!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 19, 2019 | 12:46 PM

వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న టీమిండియాకు ఉగ్రముప్పు పొంచి ఉందని భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ)కి మెయిల్‌ రావడం కలకలం రేపింది. విండీస్‌ పర్యటనలో ఉన్న భారత క్రికెటర్ల కదలికల్ని ఎప్పటికప్పుడూ ఫాలో అవుతున్నామని,  ఆటగాళ్లు ప్రమాదంలో ఉన్నారంటూ బీసీసీఐకి మెయిల్‌ వచ్చింది. ఆదివారం వచ్చిన ఈ మెయిల్‌ బీసీసీఐ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.

ఈ క్రమంలోనే ఆంటిగ్వాలోని భారత హైకమిషన్‌కు సమాచారమిచ్చామని ఓ బీసీసీఐ అధికారి పీటీఐకి చెప్పారు. ఈ నేపథ్యంలో హైకమిషన్‌.. స్థానిక ప్రభుత్వ యంత్రంగాన్ని అప్రమత్తం చేసిందని, భారత ఆటగాళ్లకు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేసిందని  చెప్పారు. తొలుత పీసీబీకి ఆ మెయిల్‌ వచ్చిందని, దాన్ని ఐసీసీతో బీసీసీఐకి వారు పంపినట్లు తెలుస్తోంది. అయితే అది ఉత్తిదేనని తేలింది’ అని బీసీసీ అధికారి ఒకరు వెల్లడించారు. అయితే భద్రతా విషయంలో రాజీపడబోమని ఆ అధికారి స్పష్టం చేశారు.