ఆర్చర్​ అటువంటి పద్దతి సరికాదు : షోయబ్‌ అక్తర్‌

ఇంగ్లాండ్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌పై పాకిస్థాన్‌ బౌలింగ్‌ దిగ్గజం షోయబ్‌ అక్తర్‌ మండిపడ్డాడు. యాషెస్‌ రెండో టెస్టులో ఆర్చర్ వేసిన బంతికి ఆసీస్​ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌కు బలమైన గాయమైంది. ఆ సమయంలో నొప్పితో బాధపడుతున్న స్మిత్‌ను ఆర్చర్‌ పరామర్శించకుండా నవ్వుతూ ఉన్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అలాంటి ప్రవర్తన సరికాదని అసహనం వ్యక్తం చేశాడు. మ్యాచ్​లో గాయపడిన స్మిత్​ దగ్గరకు వెళ్లి చూడాల్సిన కనీస బాధ్యత బౌలర్‌కి ఉంటుందని..అటువంటి ఘటనలు జరిగినప్పుడు బ్యాట్స్‌మెన్ దగ్గరకు పరిగెత్తే […]

  • Ram Naramaneni
  • Publish Date - 8:59 am, Mon, 19 August 19
ఆర్చర్​ అటువంటి పద్దతి సరికాదు : షోయబ్‌ అక్తర్‌
Shoaib Akhtar slams Jofra Archer

ఇంగ్లాండ్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌పై పాకిస్థాన్‌ బౌలింగ్‌ దిగ్గజం షోయబ్‌ అక్తర్‌ మండిపడ్డాడు. యాషెస్‌ రెండో టెస్టులో ఆర్చర్ వేసిన బంతికి ఆసీస్​ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌కు బలమైన గాయమైంది. ఆ సమయంలో నొప్పితో బాధపడుతున్న స్మిత్‌ను ఆర్చర్‌ పరామర్శించకుండా నవ్వుతూ ఉన్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అలాంటి ప్రవర్తన సరికాదని అసహనం వ్యక్తం చేశాడు. మ్యాచ్​లో గాయపడిన స్మిత్​ దగ్గరకు వెళ్లి చూడాల్సిన కనీస బాధ్యత బౌలర్‌కి ఉంటుందని..అటువంటి ఘటనలు జరిగినప్పుడు బ్యాట్స్‌మెన్ దగ్గరకు పరిగెత్తే మొదటి పర్సన్ తానే అని చెప్పుకొచ్చాడు. బౌన్సర్స్ ఆటలో భాగమన్న అక్తర్..కర్టసీ కూడా ముఖ్యమని సూచించాడు. కాగా క్రికెట్ అభిమానులు కూడా సోషల్ మీడియాలో ఆర్చర్‌ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.