AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆపరేషన్ సింధూర్‌పై విదేశాలకు భారత బృందం.. కాంగ్రెస్‌ సిఫారసులో కనిపించని శశిథరూర్‌ పేరు!

పాకిస్తాన్ ఉగ్రవాదంపై ప్రపంచానికి వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక బృందాన్ని పంపుతుంటే, కాంగ్రెస్‌లో మాత్రం పైకి కనిపించని రాజకీయం మొదలైంది. పేర్ల మీద కాంగ్రెస్‌ నేరుగా విమర్శలు చేయడం లేదుగానీ, పరోక్షంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. తమ పార్టీకి చెందిన నలుగురు ఎంపీల పేర్లను కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు కోరారని జైరామ్‌ రమేష్‌ వెల్లడించారు.

ఆపరేషన్ సింధూర్‌పై విదేశాలకు భారత బృందం.. కాంగ్రెస్‌ సిఫారసులో కనిపించని శశిథరూర్‌ పేరు!
Kharge Shashi Tharoor
Balaraju Goud
|

Updated on: May 17, 2025 | 12:48 PM

Share

పాకిస్తాన్ ఉగ్రవాదంపై ప్రపంచానికి వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక బృందాన్ని పంపుతుంటే, కాంగ్రెస్‌లో మాత్రం పైకి కనిపించని రాజకీయం మొదలైంది. పేర్ల మీద కాంగ్రెస్‌ నేరుగా విమర్శలు చేయడం లేదుగానీ, పరోక్షంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. తమ పార్టీకి చెందిన నలుగురు ఎంపీల పేర్లను కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు కోరారని జైరామ్‌ రమేష్‌ వెల్లడించారు. అయితే, తమ పార్టీ ఈ నలుగురి పేర్లను పంపిందని, ఆయన చేసిన ట్వీట్‌ ప్రాధాన్యత సంతరిచుకుంది.

ఉగ్రవాదానికి సంబంధించి పాకిస్తాన్‌ను అంతర్జాతీయ స్థాయిలో బహిర్గతం చేయడానికి, కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష ప్రతినిధి బృందాన్ని విదేశాలకు పంపాలని నిర్ణయించింది. మే నెలాఖరులో, ఈ ప్రతినిధి బృందం వివిధ దేశాలను సందర్శించి, భారతదేశ దృక్కోణాన్ని ప్రదర్శిస్తుంది. ఈ ప్రతినిధి బృందంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ను చేర్చింది కేంద్ర ప్రభుత్వ. కానీ కాంగ్రెస్ పార్టీ పంపిన జాబితాలో ఆయన పేరు కనిపించకపోవడం విశేషం.

అసలే ఈ మధ్య శశిథరూర్‌కు, బీజేపీకి దూరం తగ్గుతోందని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌లో థరూర్‌కు పెద్దగా ప్రియారటీ లేదని పొలిటికల్‌ సర్కిల్స్‌లో కథలు చక్కర్లు కొడుతున్నాయి. పార్టీ శ్రేణికి వ్యతిరేకంగా చేసిన ప్రకటనల కారణంగా థరూర్ ఇటీవలి కాలంలో వివాదాల్లో ఉన్నారు. అప్పటి నుంచి పార్టీ హైకమాండ్ థరూర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆయన పేరును పార్టీ నుంచి తొలగించాలని చాలా మంది నాయకులు హైకమాండ్‌ను కోరారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, ప్రభుత్వం థరూర్‌ను పంపడానికి ప్రతిపాదించింది, దీనిపై కాంగ్రెస్ సభ్యులను ఎంపిక చేయడం తమ నిర్ణయం అని, దానిని పార్టీ నాయకత్వం నిర్ణయిస్తుందని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జైరామ్‌ ట్వీట్‌ చేయగానే, శశిథరూర్‌ కూడా ట్వీట్‌ చేశారు.

అత్యంత కీలకమైన క్షణాల్లో భారతదేశం ఐక్యంగా ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ఉగ్రవాదం పట్ల శూన్య సహనం అనే ఉమ్మడి సందేశాన్ని తీసుకువెళ్లడానికి ఏడు అఖిలపక్ష ప్రతినిధుల బృందాలు త్వరలో కీలక భాగస్వామి దేశాలను సందర్శించనున్నాయి. రాజకీయాలకు అతీతంగా, విభేదాలకు అతీతంగా జాతీయ ఐక్యతకు శక్తివంతమైన ప్రతిబింబించనుంది. ప్రభుత్వంలో కాంగ్రెస్ నుంచి శశి థరూర్, బీజేపీ నుంచి రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా, శరద్ పవార్ ఎన్సీపీ నుంచి సుప్రియా సూలే, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన నుంచి శ్రీకాంత్ షిండే, డీఎంకే నుంచి కనిమొళి, జేడీయూ నుంచి సంజయ్ కుమార్ ఝా ఉన్నారు.

కాగా, అఖిలపక్షానికి నేతృత్వం వహించడంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ ట్వీట్‌ చేశారు. జాతి ప్రయోజనాలు ముఖ్యం ఉన్నప్పుడు.. నా సేవలు అవసరం అనుకున్నప్పుడు వెనక్కి తగ్గనంటూ శశిథరూర్‌ ఒక పోస్ట్‌ పెట్టారు. జై హిందూ అంటూ థరూర్‌ ట్వీట్‌ చేశారు.

ఇదిలావుంటే, ఈ ప్రభుత్వ ప్రతినిధి బృందంలో దాదాపు 40 మంది ఎంపీలు ఉన్నారు. వారిని ఏడు ప్రాంతీయ గ్రూపులుగా విభజించనున్నారు. ప్రతి బృందంలో 7-8 మంది సభ్యులు ఉంటారు. మే 22-23 నుండి 10 రోజుల వ్యవధిలో నాలుగు నుండి ఐదు దేశాలను సందర్శిస్తారని భావిస్తున్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ నుండి ఒక అధికారి కూడా ప్రతినిధి బృందంతోపాటు వస్తారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

మొత్తమ్మీద ఈ అఖిలపక్షం ఎపిసోడ్‌లో అటు కాంగ్రెస్‌గానీ, ఇటు శశిథరూర్‌గానీ, ఎక్కడా బయటకు విమర్శనాత్మకంగా మాట్లాడటం లేదు. అయితే నర్మగర్భంగా మాత్రం తాము చెప్పదలచుకున్నది రెండువైపుల నుంచి నేతలు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..