Mumbai High Alert: ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు.. అణువణువున గాలిస్తోన్న భద్రతాదళాలు
దేశంలో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. మరోవైపు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం, తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌ను బాంబుతో పేల్చేస్తామంటూ బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. ఉగ్రవాదులు అఫ్జల్ గురు, సైవక్కు శంకర్‌లను ఉరితీసినందుకు ప్రతీకారం అంటూ ఆ ఇమెయిల్‌లో బెదిరింపులు ఉన్నాయి. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆయా ప్రాంతాల్లో భద్రతను పెంచారు. మెయిల్ పంపిన వారిని గుర్తించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు.

దేశ ఆర్ధిక రాజధాని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం, తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై మరోసారి బాంబు దాడి చేస్తామని బెదిరింపు లేఖను ముంబై విమానాశ్రయ పోలీసుల ఇమెయిల్ ఐడికి మెయిల్ ద్వారా పంపించారు. తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్, విమానాశ్రయంపై బాంబు దాడి జరుగనున్నదని ఆ ఇమెయిల్ లో పేర్కొన్నారు.
ముంబై విమానాశ్రయం, తాజ్ మహల్ ప్యాలెస్ పై బాంబు దాడి చేస్తామని బెదిరింపు ఇమెయిల్ కలకలం సృష్టించింది. పోలీసులు, భద్రతా సంస్థలు అప్రమత్తమై దర్యాప్తు ప్రారంభించాయి. ఆ మెయిల్‌లో ఉగ్రవాదులు అఫ్జల్ గురు, సైవక్కు శంకర్‌లను “అన్యాయంగా ఉరితీయడం” గురించి ప్రస్తావిస్తూ.. బెదిరింపు లేఖలో పేర్కొన్నారు. ముంబై పోలీసులు ఆ మెయిల్ పంపిన వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
భద్రతా సంస్థలు అప్రమత్తం
బెదిరింపు ఈమెయిల్స్ అందిన తర్వాత భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. దీని తరువాత ముంబై అంతటా పారామిలిటరీ దళాలను మోహరించారు. ఇక్కడ డాగ్ స్క్వాడ్ బృందం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం, తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌లోని ప్రతి మూలను శోధించింది. ముంబై పోలీసులు ఆ మెయిల్ పంపిన వ్యక్తి కోసం వెతకడం ప్రారంభించారు. గతంలో కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు దాడి బెదిరింపు వచ్చింది.
ఉగ్రవాదులపై సైన్యం ప్రతీకారం
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత, భద్రత విషయంలో ప్రత్యేక నిఘా పెడుతున్నారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాదులు 26 మంది అమాయక పర్యాటకులను చంపారు. మరణించిన పర్యాటకులలో చాలా మంది మహారాష్ట్రకు చెందినవారు. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారతదేశం పాకిస్తాన్, పీవోకేలో వైమానిక దాడులు చేసింది. భారత సైన్యం పాకిస్తాన్ సరిహద్దులోకి ప్రవేశించి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఇందులో 100 మందికి పైగా మరణించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








