మార్ఫింగ్ యాప్స్ తో లైంగిక వేధింపులు

అందరిదీ ఒకదారైతే.. ఆమెది మరోదారి అన్నట్టుంది నెట్టింట్లో వ్యవహారం. ఏదో సరదాకోసం ఫేస్ బుక్, ఇన్ స్టా, ట్విట్టర్ వంటి చోట్ల ఆడవాళ్లు ఉంచుతోన్న ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ మాయగాళ్లు నీచమైన పనులకు వాడుకుంటున్నారు.

మార్ఫింగ్ యాప్స్ తో లైంగిక వేధింపులు
Follow us
Anil kumar poka

|

Updated on: Aug 25, 2020 | 2:14 PM

అందరిదీ ఒకదారైతే.. ఆమెది మరోదారి అన్నట్టుంది నెట్టింట్లో వ్యవహారం. ఏదో సరదాకోసం ఫేస్ బుక్, ఇన్ స్టా, ట్విట్టర్ వంటి చోట్ల ఆడవాళ్లు ఉంచుతోన్న ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ మాయగాళ్లు నీచమైన పనులకు వాడుకుంటున్నారు. వివిధ సోషల్ మీడియా ఖాతాల్లో యువతులు, విద్యార్థినులు, మహిళలు ఉంచిన ఫొటోలు, వీడియోలు డౌన్ లోడ్ చేసి తర్వాత వాటిని వివిధ మార్ఫింగ్ యాప్స్ సాయంతో అసభ్యకరంగా చిత్రీకరించి డబ్బులు కోసం, లైంగిక కోర్కెలు తీర్చాలంటూ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నారు.

లేదంటే.. వాళ్లవాళ్ల సోషల్ మీడియా ఖాతాలకు మార్ఫింగ్ చేసిన నగ్న వీడియోలు, చాట్ లు పంపించి అందరికీ తెలిసేట్టు చేసి తలెత్తుకోలేకుండా చేస్తున్నారని అనేక మంది పోలీసులకు మొరపెట్టుకుంటున్నారు. ఈ ఆన్ లైన్ నేరాలపై సైబర్ క్రైమ్స్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ బాధితులకు అభయమిస్తున్నారు. ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదుచేయాలని చెబుతున్నారు. 94906 16555 నెంబర్ కు వాట్సాప్, లేదా 040 27852412కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని.. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు. సో.. డోంట్ వర్రీ.