ఇండియాలో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ రెండోదశ ట్రయల్స్
ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం తయారుచేస్తున్న కరోనా వ్యాక్సిన్ రెండు దశ క్లినికల్ ట్రయల్స్ పూణేకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ రోజు ప్రారంభించనుంది.
ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం తయారుచేస్తున్న కరోనా వ్యాక్సిన్ రెండు దశ క్లినికల్ ట్రయల్స్‌ను పూణేకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ రోజు ప్రారంభించనుంది. పూణేలోని భారతి విద్యాపీఠ్ వైద్య కళాశాల, ఆసుపత్రిలో ఈ ట్రయల్స్ జరగనున్నాయి. ఇందుకోసం అన్ని అనుమతులను ఎస్‌ఐఐకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) ఇచ్చింది.
ఎస్ఐఐ ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ. వ్యాక్సిన్ ఉత్పత్తితో పాటు అమ్మకాల్లోనూ ఈ సంస్థ వరల్డ్‌వైడ్ సత్తా చాటుతోంది. వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసే క్రమంలో భాగంగా ఈ సంస్థ.. బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనెకా భాగస్వామ్యంతో అడుగులు వేస్తోంది. క్లినికల్ ట్రయల్స్ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియా ప్రకారం, ఆరోగ్యకరమైన భారతీయ పెద్దలలో వ్యాక్సిన్ భద్రత, రోగనిరోధక ప్రతిస్పందనను చెక్ చేయడానికి ఫేజ్ II / III ట్రయల్స్‌లో భాగంగా 17 ప్రాంతాల్లో ఈ ప్రయోగాలు జరుపనున్నారు. వీటిలో విశాఖలోని ఆంధ్ర మెడికల్ కాలేజ్ కూడా ఉంది. 18 ఏళ్లు పైబడిన 1,600 మంది ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు సమాచారం. డాక్టర్ ప్రసాద్ కులకర్ణి ఎస్ఐఐకి ప్రధాన పరిశోధకుడిగా వ్యవహరించనున్నారు. ఈ ప్రక్రియకు కూడా ఆయనే నాయకత్వం వహిస్తారు. ‘కొవిషీల్డ్’ పేరుతో ఈ వ్యాక్సిన్ తయారుచేస్తున్నారు.
Also Read :
సంచలన నిర్ణయం దిశగా జగన్ సర్కార్ : రేషన్ బియ్యం వద్దంటే డబ్బు!