Omicron Covid Variant: భారత్‌లో ఒమిక్రాన్ టెర్రర్.. ఒక్కరోజే 8 కేసులు నమోదు.. ఏడు ఒకే రాష్ట్రంలో..
భారత్‌లో కూడా ఒమిక్రాన్ టెర్రర్ కొనసాగుతోంది. ఇవాళ ఒక్కరోజే 8 కేసులు వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్రలో 7 , ఢిల్లీలో ఒక్క కేసు తాజాగా బయటపడ్డాయి. దీంతో భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్..
భారత్‌లో కూడా ఒమిక్రాన్ టెర్రర్ కొనసాగుతోంది. ఇవాళ ఒక్కరోజే 8 కేసులు వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్రలో 7 , ఢిల్లీలో ఒక్క కేసు తాజాగా బయటపడ్డాయి. దీంతో భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 12కు చేరుకుంది. మహారాష్ట్రలోని పింప్రీ చించ్వాడలో ఆరు, పుణేలో ఒక్క కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 797 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీకి అంతర్జాతీయ దేశాల నుంచి విమానాల రాకపోకలను నిషేధించాలని కేంద్రానికి లేఖ రాశారు సీఎం కేజ్రీవాల్.
రెండ్రోజుల క్రితమే దేశంలోకి ఎంట్రీ ఇచ్చింది ఒమిక్రాన్ వేరియంట్. ఫస్ట్ డే బెంగళూరులో 2 కేసులు..నెక్స్ట్ డే మరో రెండు..గుజరాత్‌లో ఒకటి, మహారాష్ట్ర లోనే 8 , ఢిల్లీలో మరో ఒమిక్రాన్ పాజిటివ్ నిర్థారణ అయింది..టాంజానియా నుంచి ఢిల్లీకి చేరుకున్న వ్యక్తికి న్యూ వేరియంట్ సోకింది. దీంతో దేశంలో 3రోజుల్లోనే 12 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి
రెండ్రోజుల క్రితమే దేశంలోకి ఎంట్రీ ఇచ్చింది ఒమిక్రాన్ వేరియంట్. ఫస్ట్ డే బెంగళూరులో 2 కేసులు..నెక్స్ట్ డే మరో రెండు..గుజరాత్‌లో ఒకటి, మహారాష్ట్ర లోనే 8 , ఢిల్లీలో మరో ఒమిక్రాన్ పాజిటివ్ నిర్థారణ అయింది..టాంజానియా నుంచి ఢిల్లీకి చేరుకున్న వ్యక్తికి న్యూ వేరియంట్ సోకింది. దీంతో దేశంలో 3రోజుల్లోనే 12 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఢిల్లీలో ఓ వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ బయటపడడంతో హైఅలర్ట్ ప్రకటించారు. ఢిల్లీకి అంతర్జాతీయ దేశాల నుంచి విమానాల రాకపోకలను నిషేధించాలని కేంద్రానికి లేఖ రాశారు సీఎం కేజ్రీవాల్.
కరోనా కేసులు, పాజిటివిటీ రేటు, మరణాలు పెరుగుతుండటంతో 5 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాన్ని కేంద్రం అప్రమత్తం చేసింది. కరోనా కట్టడికి నిర్దుష్టమైన చర్యలు చేపట్టాలంటూ కర్ణాటక, కేరళ, తమిళనాడు,ఒడిశా, మిజోరం,జమ్ముకశ్మీర్‌లకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి లేఖలు రాశారు. ఇక విదేశాల నుంచి ఇండియాలోని మిగతా నగరాలకు వచ్చిన వారిలో పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో ఎంత మందిలో ఒమిక్రాన్ వేరియంట్ ఉందోననే గుబులు పట్టుకుంది.
ఇవి కూడా చదవండి: Hyderabad Water Supply: భాగ్యనగరవాసులకు అలెర్ట్.. పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం
Hyderabad: పట్టపగలు దడపుట్టిస్తున్న పోకిరీలు.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ మధ్య బైక్ స్టంట్స్..