ఆర్టికల్370 రద్దు: సుప్రీంకు ఒమర్ అబ్దుల్లా పార్టీ
ఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో 370 అధికరణను రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాకు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ ఉత్తర్వులు చెల్లుబాటు కాకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ ఆ పార్టీ నేతలు మహ్మద్ అక్బర్ లోన్, హస్నేన్ మసూదీ నేడు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అంతేగాక.. జమ్ముకశ్మీర్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ 2019 రాజ్యంగ విరుద్ధమని ప్రకటించాలని […]

ఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో 370 అధికరణను రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాకు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ ఉత్తర్వులు చెల్లుబాటు కాకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ ఆ పార్టీ నేతలు మహ్మద్ అక్బర్ లోన్, హస్నేన్ మసూదీ నేడు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అంతేగాక.. జమ్ముకశ్మీర్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ 2019 రాజ్యంగ విరుద్ధమని ప్రకటించాలని పిటిషనర్లు కోరారు.