హైవేపై ఉల్లి..పండగ చేసుకుంటున్న జనం

ఉల్లి ధరలు అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆనియన్స్‌పైనే చర్చ. సామాన్య ప్రజలే కాదు. అసెంబ్లీల్లో కూడా ఉల్లిపైనే గంటలకు గంటలు రచ్చ జరుగుతోంది. మరోవైపు సోషల్‌ మీడియాతో పాటు మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియాలోనూ ఉల్లి వార్తలే కనిపిస్తున్నాయి. ఉల్లి దొంగతనాలు, ఆనియన్స్‌ ఆఫర్లు, సెటైర్లు, జోకులు ఇలా ఉల్లి టాక్‌ ఆఫ్‌ ది కంట్రీగా మారిపోయింది. ఇక కేజీ ఉల్లి కొనాలంటేనే ఆలోచిస్తున్న ఈ రోజుల్లో లారీ ఉల్లిపాయలు రోడ్డుపై కనిపిస్తే జనం ఊరుకుంటారా..ఇప్పుడిదే […]

హైవేపై ఉల్లి..పండగ చేసుకుంటున్న జనం
Follow us

|

Updated on: Dec 13, 2019 | 11:11 AM

ఉల్లి ధరలు అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆనియన్స్‌పైనే చర్చ. సామాన్య ప్రజలే కాదు. అసెంబ్లీల్లో కూడా ఉల్లిపైనే గంటలకు గంటలు రచ్చ జరుగుతోంది. మరోవైపు సోషల్‌ మీడియాతో పాటు మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియాలోనూ ఉల్లి వార్తలే కనిపిస్తున్నాయి. ఉల్లి దొంగతనాలు, ఆనియన్స్‌ ఆఫర్లు, సెటైర్లు, జోకులు ఇలా ఉల్లి టాక్‌ ఆఫ్‌ ది కంట్రీగా మారిపోయింది.

ఇక కేజీ ఉల్లి కొనాలంటేనే ఆలోచిస్తున్న ఈ రోజుల్లో లారీ ఉల్లిపాయలు రోడ్డుపై కనిపిస్తే జనం ఊరుకుంటారా..ఇప్పుడిదే జరిగింది గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ జిల్లా గోండల్‌లో. హైవేపై ఉల్లి లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తా పడటంతో అందులోని ఆనియన్స్‌ అన్నీ రోడ్డుపై పడిపోయాయి. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకొని ఎగబడి మరీ సంచుల్లో నింపుకుంటున్నారు. ఇక ఉల్లితో పండగ చేసుకోవచ్చని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Latest Articles